Reliance Retail: భారతదేశంతో పాటు ఆసియాలో ప్రముఖ వ్యాపారుల్లో ఒకరిగా ఉన్న అంబానీ తన వారసులకు వివిధ వ్యాపారాల బాధ్యతలను ఇప్పటికే అప్పగించారు. ఈ క్రమంలో కుమార్తె ఇషాకు రిలయన్స్ రిటైల్ పగ్గాలు దక్కాయి. తాజాగా ఆమె పనితీరుతో కంపెనీ సరికొత్త మైలురాయిని అందుకోవటం గమనార్హం.
రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ రిటైల్ విభాగం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(RRVL) తాజాగా తన 2024 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో ఇషా అంబానీ నేతృత్వంలో రిటైల్ వ్యాపారం మార్చి త్రైమాసికంలో రూ.2,698 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని నమోదు చేసింది. గతేడాది మార్చి త్రైమాసికంలో ఆర్జించిన రూ.2,415 కోట్ల లాభంతో పోలిస్తే ఇది 11.7% అధికం.

ఇక్కడ గమనించాల్సిన విశేషం ఏమిటంటే కంపెనీ వార్షిక లాభం తొలిసారిగా రూ.10,000 కోట్ల మార్కు మైలురాయిని అధిగమించడం. ఇది ఇషా అంబానీ అత్యుత్తమ పనితీరుకు అద్ధంపడుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. తండ్రికి తగ్గ తనయ అంటూ చాలా మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలాగే వ్యాపార నిర్వహణ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 9.8 శాతం పెరిగి మార్చి త్రైమాసికంలో రూ.67,610 కోట్లకు చేరుకుంది. అయితే ఇది డిసెంబర్ త్రైమాసికంతో పోల్చితే రూ.74,374 కోట్ల కంటే 9 శాతం క్షీణించింది.
2024 పూర్తి ఆర్థిక సంవత్సరానికి రిలయన్స్ రిటైల్ మొత్తం ఆదాయం రూ.2,73,079 కోట్లుగా ఉంది. గత ఏడాది కంటే ఇది దాదాపు రూ.40,000 కోట్ల పెరుగుదలను నమోదు చేసింది. రిలయన్స్ రిటైల్ FY2024లో కొత్తగా 1,840 కొత్త స్టోర్‌లను ప్రారంభించింది. దీంతో దేశంలో మొత్తం స్టోర్‌ల సంఖ్య 18,836కి చేరుకుంది. కంపెనీ అమ్మకాల పెరుగుదల వెనుక కంపెనీ డిజిటల్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ జియోమార్ట్ అమ్మకాలు ప్రధాన పాత్ర పోషించాయి. దీంతో అమ్మకాలు పెరిగి లాభాలు పెరిగాయి. ఈ క్రమంలో మొత్తం రిజిస్టర్డ్ కస్టమర్ల సంఖ్య రూ.30.40 కోట్లుగా ఉన్నారు. ఇది గతేడాది కంటే 22.2 శాతం ఎక్కువ.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications