Forbes Richest List 2024: కొత్త ఏడాది ప్రారంభమైన తర్వాత ఫోర్బ్స్ తాజా సంపన్నుల జాబితా వచ్చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం దేశంలో కొత్తగా కుబేరులైన వారి సంఖ్య అధికంగా ఉన్నట్లు వెల్లడైంది.
ఈ ఏడాది భారతదేశంలో 25 మంది కొత్త బిలియనీర్లు పుట్టుకొచ్చారు. గత ఏడాది 169 మంది బిలియనీర్ల సంఖ్యతో పోలిస్తే.. ప్రస్తుతం దేశంలోని మొత్తం బిలియనీర్ల సంఖ్య 200కి చేరుకుంది. కొత్త ఫోర్బ్స్ నివేదిక ప్రకారం భారత బిలియనీర్ల మొత్తం సంపద 954 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇది గత ఏడాది 675 బిలియన్ డాలర్ల కంటే దాదాపు 41 శాతం అధికం.

దేశంలోని అగ్ర బిలియనీర్లుగా నిలిచిన వ్యక్తుల వివరాలు వారి సంపదను పరిశీలిస్తే.. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కి చెందిన ముఖేష్ అంబానీ జాబితాలో 116 బిలియన్ డాలర్ల నికర సంపదతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఇక అదానీ గ్రూప్ నడుపుతున్న గౌతమ్ అదానీ సంపద 84 బిలియన్ డాలర్లుగా ఉండటంతో రెండవ స్థానానికి పరిమితం అయ్యారు. తర్యాతి స్థానాల్లో శివ్ నాడర్ 36.9 బిలియన్ డాలర్లు, సావిత్రి జిందాల్ కుటుంబం 33.5 బిలియన్ డాలర్లు, దిలీప్ సంఘ్వీ సంపద 26.7 బిలియన్ డాలర్లుగా నమోదైంది.
ప్రపంచంలోని టాప్-10 సంపన్నుల జాబితాలో కేవలం ఇండియా నుంచి ముఖేష్ అంబానీ మాత్రమే ఉన్నారు. అంబానీ ప్రపంచంలో 9న అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఇదే సమయంలో బెర్నార్డ్ ఆర్నాల్ట్ మెుదటి స్థానంలో కొనసాగుతుండగా.. తర్వాతి స్థానాల్లో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్, లారీ ఎలిసన్, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, స్టీవ్ బాల్మెర్, ముఖేష్ అంబానీ, లారీ పేజ్ కొనసాగుతున్నారు.
ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2024లో భారతీయ బిలియనీర్లు:
ముఖేష్ అంబానీ - నికర విలువ 116 బిలియన్ డాలర్లు - 9వ ర్యాంక్
గౌతమ్ అదానీ - నికర విలువ 84 బిలియన్ డాలర్లు - 17వ ర్యాంక్
శివ్ నాడర్ - నికర విలువ 36.9 బిలియన్ డాలర్లు - 39వ ర్యాంక్
సావిత్రి జిందాల్ కుటుంబం - నికర విలువ 33.5 బిలియన్ డాలర్లు - 46వ ర్యాంక్
దిలీప్ సంఘ్వీ - నికర విలువ 26.7 బిలియన్ డాలర్లు- 69వ ర్యాంక్
సైరస్ పూనావాలా - నికర విలువ 21.3 బిలియన్ డాలర్లు- 90వ ర్యాంక్
కుశాల్ పాల్ సింగ్ - నికర విలువ 20.9 బిలియన్ డాలర్లు- 92వ ర్యాంక్
కుమార్ మంగళం బిర్లా - నికర విలువ 19.7 బిలియన్ డాలర్లు- 98వ ర్యాంక్
రాధాకిషన్ దమానీ - నికర విలువ 17.6 బిలియన్ డాలర్లు - 107వ ర్యాంక్
లక్ష్మీ మిట్టల్ - నికర విలువ 16.4 బిలియన్ డాలర్లు- 113వ ర్యాంక్
రవి జైపురియా - నికర విలువ 16.2 బిలియన్ డాలర్లు- 115వ ర్యాంక్
ఉదయ్ కోటక్ - నికర విలువ 13.3 బిలియన్ డాలర్లు- 148వ ర్యాంక్
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications