Mukesh Ambani: దేశంలోని సంపన్న వ్యాపారవేత్తగా ఉన్న ముఖేష్ అంబానీ కన్ను ఒక కంపెనీ షేర్లపై ఉన్నట్లు సమాచారం. ఈ వార్త వెలుగులోకి రావటంతో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు ఆ పెన్నీ స్టాక్ కొనుగోలు చేసేందుకు తహతహలాడుతున్నారు.
స్టాక్ మార్కెట్‌లో అనేక లిస్టెడ్ కంపెనీలు ఉన్నాయి. కొన్నింటిలో బిలియనీర్ ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాను కలిగి ఉంది. అటువంటి సంస్థ హాత్వే కేబుల్ & డేటాకామ్. ఈ కంపెనీలో రిలయన్స్‌కు ప్రధాన వాటాదారుగా ఉంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే హాత్వే కేబుల్ & డేటాకామ్ షేర్ ధర రూ.25 కంటే తక్కువగా మార్కెట్లో కొనసాగుతోంది.

గత గురువారం మార్కెట్లు ముగిసే సమయానికి హాత్వే కేబుల్ & డేటాకామ్ షేర్ ధర రూ.22.12గా ఉంది. గత ధర రూ.21.56తో పోలిస్తే ఈ షేరు 2.60% వృద్ధిని నమోదు చేసింది. ట్రేడింగ్ సమయంలో ఈ షేర్ 3 శాతం పెరిగి రూ.22.30కి చేరుకుంది. 6 ఫిబ్రవరి 2024న కంపెనీ షేర్ ధర 52 వారాల గరిష్ఠమైన రూ.27.90ని తాకింది.
డిసెంబర్ త్రైమాసికంలో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ పరిశీలిస్తే.. కంపెనీలో పబ్లిక్ షేర్ హోల్డింగ్ 25 శాతంగా ఉండగా.. కంపెనీ ప్రమోటర్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ జియో కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జియో ఇంటర్నెట్ డిస్ట్రిబ్యూషన్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జియో కేబుల్ అండ్ బ్రాడ్‌బ్యాండ్ హోల్డింగ్ ఉన్నాయి. Jio కంటెంట్ కంపెనీలో గరిష్టంగా 55,05,29,562 షేర్లతో 31.10 శాతం వాటాను, జియో ఇంటర్నెట్ కంపెనీ 22,06,41,491 షేర్లతో 12.46 శాతం షేర్లను కలిగి ఉంది.
డిసెంబర్ త్రైమాసికంలో హాత్వే కేబుల్ & డేటాకామ్ ఆడిట్ చేయని లాభం రూ.30.75 కోట్లుగా నమోదైంది. కంపెనీ నికర లాభం రూ.22.35 కోట్లు. కంపెనీ మొత్తం వ్యయం రూ.512.36 కోట్లుగా నమోదు కాగా.. ఆదాయం రూ.535 కోట్లుగా నమోదైంది. భారతదేశంలోని ప్రముఖ కేబుల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లలో హాత్వే కేబుల్ & డేటాకామ్ లిమిటెడ్ ఒకటిగా కొనసాగుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications