Mukesh Ambani: అంబానీ లగ్జరీ వేదిక.. జియో వరల్డ్ గార్డెన్ రోజు అద్దె ఎంతో తెలుసా..??
Jio World Garden: ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ పెళ్లి చేసుకున్న జియో వరల్డ్ గార్డెన్. ఇది ఇప్పుడు ముంబైలోని లగ్జరీ ఈవెంట్ వేదికగా మారింది. దీని ద్వారా అంబానీ కుటుంబం లక్షల్లో సంపాదిస్తోంది. జియో వరల్డ్ గార్డెన్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో ఉంది.
సుమారు 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మొక్కలు, పూలతో కనుల పండువగా గార్డెన్ ఉంది. ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ-స్లోకా మెహతా ఈ పచ్చని స్వర్గధామమైన జియో గార్డెన్‌లో వివాహం చేసుకున్నారు. పశ్చిమ ముంబైలోని అతిపెద్ద ఓపెన్ ఎయిర్ సెంటర్ ది జియో వరల్డ్ గార్డెన్. చెట్లు, వాటర్ ఫౌంటెన్స్ వంటి ఏర్పాట్లు ఇందులో ఉన్నాయి.

ఇందులో అంతర్జాతీయ థియేటర్, హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఆడిటోరియమ్స్, కార్యాలయాలు, 2000 వాహనాలకు విశాలమైన పార్కింగ్ వంటి ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. ఇది లాక్మే ఫ్యాషన్ వీక్, అరిజిత్ సింగ్ కచేరీ, ఎడ్ షీరన్ కచేరీ వంటి అంతర్జాతీయ ఈవెంట్‌లను నిర్వహించిన ప్రసిద్ధ వేదిక. ఇక్కడి జియో వండర్‌ల్యాండ్ గొప్ప ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందింది. జియో వరల్డ్ గార్డెన్‌లో ఈవెంట్‌ల కోసం రోజుకు కనీసం రూ.15 లక్షలు చార్జ్ చేస్తారు. దీనికి పన్నులు అదనం.
ఇందులో వివాహ వేడుకల నుంచి అంతర్జాతీయ ఈవెంట్ల వరకు మరపురాని అనుభూతిని అందించే విధంగా అనేక ఏర్పాట్లు ఉన్నాయి. దీంతో జియో గార్డెన్ ఇప్పుడు ముంబైలోని ధనవంతుల వివాహాలు, కార్యక్రమాలకు ఇష్టమైన వేదికగా మారింది. ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించని రోజుల్లో ప్రజలు రూ.10 రుసుముతో ప్రవేశించి చుట్టూ చూడటానికి అనుమతించబడతారు. ముఖేష్ అంబానీ జియో వరల్డ్‌ను ముంబైలో అతిపెద్ద హబ్‌గా మార్చాలని ప్లాన్ చేస్తున్నారు. ఇషా అంబానీ పిల్లల మొదటి పుట్టినరోజును ఇక్కడ జరుపుకున్నారు.


Click it and Unblock the Notifications