Ambani-Tata: ప్రాజెక్ట్ GH2.. పోటీలో అంబానీ-టాటాలు.. కంగారుగా పెట్రోల్- ఎలక్ట్రిక్ కార్లు కొనొద్దా..?
Green Hydrogen: దేశంలో ఆటో రంగంలో పెను మార్పులు మెుదలయ్యాయి. దీంతో కొనుగోలుదారులు గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ కొనాలా లేక పెట్రోల్ కారు కొనాలా అనుకుంటుండగా కేంద్ర ప్రభుత్వం GH2 ప్రాజెక్ట్‌తో ముందుకొచ్చింది.
ఈ ప్రాజెక్టులో అంబానీ, టాటా, ఇండియన్ ఆయిల్ వంటి పెద్ద సంస్థలు మాత్రమే పనిచేస్తున్నాయి. రానున్న పదేళ్లలో పెట్రోలు, డీజిల్ కార్లు కొనే వారే లేరన్న స్థాయిలో పరిస్థితి మారవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రవాణా రంగంలో గ్రీన్/గ్రే హైడ్రోజన్ (GH2)ని ఉపయోగించేందుకు ప్రభుత్వం చేపట్టిన పైలట్ ప్రోగ్రాంలో పాల్గొనేందుకు బిడ్ చేశాయి. ముడి చమురు వినియోగం, దిగుమతులను తగ్గించే క్రమంలో ప్రభుత్వం గ్రీన్ గ్రే హైడ్రోజన్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతోంది.

దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి చేయబడితే.. అది చౌకగా ఉంటుంది. తద్వారా ప్రజలు పెట్రోల్, డీజిల్ కోసం లీటరుకు రూ.100 చెల్లించాల్సిన అవసరం ఉండదు. కేవలం రూ.20- రూ.30తో 20 కి.మీ కంటే ఎక్కువ మైలేజీ వచ్చే హైడ్రోజన్ వాహనాలను రోడ్ల మీద నడపొచ్చు. తాజా పైలట్ ప్రాజెక్ట్ హైడ్రోజన్ వాయువును ఇంధనంగా ఉపయోగించడంలో సమస్యలను గుర్తించడం, సాంకేతికత అభివృద్ధి, అమలులో అవసరమైన మౌలిక లాజిస్టిక్స్ అంతరాయాలపై పూర్తిగా పరిశీలన జరుగనుంది.
కేంద్ర ప్రభుత్వ GH2 పైలట్ ప్రోగ్రాం కోసం రూ.496 కోట్ల టెండర్ ఫిబ్రవరిలో ప్రారంభించబడింది. రూ.19,744 కోట్ల నిధులతో జనవరి 2023లో ప్రారంభించిన నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కార్యక్రమంలో ఇది భాగం. అంటే హైడ్రోజన్ వాహనాన్ని నడపడానికి అవసరమైన ప్రతిదీ తప్పనిసరిగా సమీకృత బృందంగా ఉండాలి. అందుకే దీనిపై టాటా నుంచి అంబానీ వరకు దిగ్గజ కంపెనీలు అనేక ఆసక్తికరమైన కూటములు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఇది ఒక్క కంపెనీ చేత చేయబడే పని కాదు.
ఇప్పటికే అంబానీకి చెందిన రిలయన్స్ బస్సు మరియు ట్రక్కుల తయారీదారులు అశోక్ లేలాండ్, డైమ్లర్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అలాగే టాటా మోటార్స్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తో భాగస్వామ్యం కలిగి ఉంది. అశోక్ లేలాండ్ కూడా NTPCతో జాయింట్ వెంచర్. ఈ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ విజయం భారతదేశంలో పెను విప్లవానికి దారి తీస్తుంది


Click it and Unblock the Notifications