For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూడ్రోజుల్లో రూ.1500 పెరిగిన బంగారం ధర: రూ.49,000 పైకి చేరిన పసిడి

|

బంగారం ధరలు గురువారం (డిసెంబర్ 3) వరుసగా మూడో రోజు పెరిగాయి. అయితే వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. నిన్న 10 గ్రాముల డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.574.00 ఎగిసింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ రూ.403.00 (0.83%) పెరిగి రూ.48,970.00 వద్ద క్లోజ్ అయింది. కిలో డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.448.00 (0.72%) పెరిగింది. మార్చి ఫ్యూచర్స్ రూ.174.00 (0.28%) పెరిగి రూ.63,372.00 వద్ద క్లోజ్ అయింది. ఇక, నేడు దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఫ్యూచర్ ధర రూ.450 పెరిగింది.

రూ.1500 పెరుగుదల

రూ.1500 పెరుగుదల

ఎంసీఎక్స్‌లో డిసెంబర్ ఫ్యూచర్స్ రూ.450.00 (0.93%) పెరిగి రూ.49,093.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.49,874.00 ప్రారంభం కాగా, రూ.49,936.00 గరిష్టాన్ని, రూ.49,093.00 వద్ద కనిష్టాన్ని తాకింది. ఫిబ్రవరి ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.180.00 (0.37%) పెరిగి రూ.49,127.00 పలికింది. రూ.49,147.00 ప్రారంభమైన ధర రూ.49,490.00 వద్ద గరిష్టాన్ని, రూ.48,924.00 కనిష్టాన్ని తాకింది. ఫ్యూచర్ గోల్డ్ మూడు రోజుల్లో రూ.1500 పెరిగింది.

సిల్వర్ ఫ్యూచర్స్ ధర

సిల్వర్ ఫ్యూచర్స్ ధర

సిల్వర్ ఫ్యూచర్స్ మాత్రం స్వల్పంగా తగ్గింది. రూ.250.00 (-0.40%) క్షీణించి రూ.61903.00 ట్రేడ్ అయింది. రూ.62,600.00 వద్ద ప్రారంభమై, రూ.63,000.00 గరిష్టాన్ని, రూ.61,903.00 కనిష్టాన్ని తాకింది.

మార్చి ఫ్యూచర్స్ రూ.25.00 (0.04%) పెరిగి రూ.63350.00 వద్ద ట్రేడ్ అయింది. రూ.63,638.00 ప్రారంభమై, రూ.64,398.00 గరిష్టాన్ని, రూ.62,923.00 వద్ద కనిష్టాన్ని తాకింది.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరిగాయి. +6.75 (+0.37%) డాలర్లు పెరిగి 1,837 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. నేటి సెషన్లో 1,826.85 - 1,847.25 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో 21 శాతం పెరిగింది.

సిల్వర్ ఫ్యూచర్స్ స్వల్పంగా తగ్గింది. -0.013 (-0.05%) డాలర్లు తగ్గి 24.067

డాలర్లు పలికింది. నేటి సెషన్లో 23.858 - 24.420 డాలర్ల మధ్య ట్రేడ్ అయింది. ఏడాదిలో వెండి 38 శాతం పెరిగింది.

English summary

మూడ్రోజుల్లో రూ.1500 పెరిగిన బంగారం ధర: రూ.49,000 పైకి చేరిన పసిడి | Gold prices today jump, rise Rs 1,500 in 3 days, silver rates surge

Gold and silver prices in Indian markets rose today for the third day in a row. On MCX, February futures were 0.9% higher at ₹49379 per 10 gram while silver futures rose 1% to ₹64018 per kg.
Story first published: Thursday, December 3, 2020, 22:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X