For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరకు 'అమెరికా ప్యాకేజీ' మద్దతు: ధర పెరుగుతుందా, తగ్గుతుందా?

|

దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు స్వల్పంగా హెచ్చుతగ్గులు నమోదు చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో మార్చి నుండి ధరలు భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ 2,072, భారత ఫ్యూచర్ మార్కెట్లో రూ.56,200 దాటింది. ఆ తర్వాత వ్యాక్సీన్ ఆశలతో ధరలు తగ్గి, గత రెండు నెలలకు పైగా భారత్‌లో రూ.49వేల నుండి రూ.52వేల మధ్య, అంతర్జాతీయంగా ఔన్స్ 1850 డాలర్ల నుండి 1950 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతోంది.

రెండు వారాల్లో రూ.2,000 తగ్గిన బంగారం ధర, మరింత పడిపోనుందా?రెండు వారాల్లో రూ.2,000 తగ్గిన బంగారం ధర, మరింత పడిపోనుందా?

వ్యాక్సీన్ వచ్చినా.. బంగారంపై అమెరికా వృద్ధి ప్రభావం

వ్యాక్సీన్ వచ్చినా.. బంగారంపై అమెరికా వృద్ధి ప్రభావం

కరోనా వ్యాక్సీన్ పైన ఫైజర్, మోడర్నా ప్రకటనలు ఆశాజనకంగా ఉండటంతో ఈక్విటీ మార్కెట్లు పుంజుకున్నాయి. డాలర్ బలపడుతోంది. ఆయితే ఆ మేరకు పసిడి ధరల్లో తగ్గుదల కనిపించడం లేదని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. గత రెండు వారాల్లో రూ.2వేల వరకు తగ్గిన పసిడి ఈ వారం స్వల్ప లాభాలతో ప్రారంభించింది. వ్యాక్సీన్ ప్రకటనలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ అమెరికా ప్యాకేజీ తదితర అంశాల కారణంగా పసిడి ధరల్లో పెద్దగా తగ్గుదల ఉండకపోవచ్చునని అంటున్నారు. 2021 మొదటి క్వార్టర్‌లో అమెరికా వృద్ధి భారీగా కుంగిపోనుందని జేపీ మోర్గాన్ అంచనా వేసింది. రానున్న రోజుల్లో వ్యాక్సీన్ వచ్చినప్పటికీ బంగారంపై అమెరికా వృద్ధి అంచనా రేటు ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు.

వచ్చే 3 త్రైమాసికాల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ

వచ్చే 3 త్రైమాసికాల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ

బంగారం ధరలు గత పది రోజులుగా ఔన్స్ 1875 డాలర్లకు అటు ఇటుగా కదులుతున్నాయి. వారంలో 0.84 శాతం క్షీణించాయి. మద్దతు ధర అక్టోబర్ 1850 డాలర్ల వద్ద కనిపిస్తోంది. పలుదేశాల్లో కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వృద్ధి మందగిస్తుందని అంచనా వేస్తున్న సంస్థల్లో జేపీ మోర్గాన్ ఉంది. వైరస్ వల్ల 2020 నాలుగో త్రైమాసికంలో 2.8 శాతం వృద్ధి రేటును అంచనా వేస్తున్న జేపీ మోర్గాన్, 2021 మొదటి త్రైమాసికంలో మైనస్ 1 శాతాన్ని అంచనా వేసింది. రెండో త్రైమాసికంలో 4.5 శఆతం వృద్ధి రేటు, మూడో త్రైమాసికంలో 6.5 శాతం వృద్ధి రేటు ఉంటుందని భావిస్తున్నారు.

బంగారం ధరకు ప్యాకేజీ లింక్

బంగారం ధరకు ప్యాకేజీ లింక్

అమెరికా ఆర్థిక ప్యాకేజీ ఆలస్యం బంగారం ధరకు అనుకూలంగా మారిందని అంతర్జాతీయ బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అమెరికాకు సంబంధించి ఫెడ్ మద్దతు లిక్విడిటీ రూపంలో ఉండవచ్చునని, అది తక్కువ వడ్డీ రేట్లకు కారణం కావొచ్చునని అంటున్నారు. అదే జరిగితే స్వల్పకాలంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అయితే భారీగా పెరగకపోవచ్చునని, స్వల్పంగా ఉండవచ్చునని అంటున్నారు. అయితే లాంగ్ టర్మ్‌లో బంగారం ధరలు రూ.67వేల వరకు పెరగవచ్చునని గతంలో మోతీలాల్ ఓస్వాల్ అంచనా వేసిన విషయం తెలిసిందే.

English summary

బంగారం ధరకు 'అమెరికా ప్యాకేజీ' మద్దతు: ధర పెరుగుతుందా, తగ్గుతుందా? | Gold Price Prediction: Prices may rise slightly as stimulus hopes outweigh vaccine optimism

Gold climbed higher on Monday, as a softer dollar and hopes of further U.S. monetary stimulus to cushion the pandemic-hit economy offset optimism over the possibility of a COVID-19 vaccine rollout next month.
Story first published: Monday, November 23, 2020, 13:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X