Amit Shah Portfolio: కేంద్ర హోం మంత్రి అమిత్ షా పెట్టుబడుల వివరాలను తాజాగా వెల్లడించారు. గుజరాత్ గాంధీనగర్ నుంచి పోటీలో ఉన్న అమిత్ షా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఏకంగా 180 కంపెనీల్లో పెట్టుబడులను కలిగి ఉన్నట్లు వెల్లడించారు.
అఫిడవిట్ వివరాల ప్రకారం అమిత్ షా మెుత్తం పెట్టుబడుల విలువ రూ.17.46 కోట్లుగా ఉండగా.. ఆయన భార్య సోనల్ షా 80 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయటంతో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల విలువ రూ.20 కోట్లని వెల్లడైంది. అనేక కంపెనీల్లో పెట్టుబడులు కలిగి ఉన్నప్పటికీ షా జంటకు ప్రధానంగా 10 కంపెనీల షేర్లలో మాత్రం పెట్టుబడులు గణనీయంగా ఉన్నాయని తేలింది. విరవాల్లోకి వెళితే..

Canara Bank: ప్రభుత్వ బ్యాంకులో అమిత్ షా దాదాపు రూ.7.25 లక్షల విలువైన షేర్లను హోల్డ్ చేస్తుండగా.. భార్య సోనాల్ షా రూ.2.96 కోట్ల విలువైన 50,000 షేర్లు కలిగి ఉన్నారు.
Procter & Gamble: యూఎస్ ఎఫ్ఎంసీజీ కంపెనీలో షా దంపతులిద్దరికీ ఒక్కొక్కరూ రూ.1.9 కోట్లకుపైగా పెట్టుబడులు ఉన్నాయి.
Karur Vysya Bank: ప్రైవేటు బ్యాంకులో సోనాల్ షా లక్ష షేర్లను కలిగి ఉండగా వాటి విలువ రూ.1.9 కోట్లని వెల్లడైంది.
Gujarat Fluorochemicals: ఈ కంపెనీలో సోనాల్ షా రూ.1.79 కోట్ల పెట్టుబడి పెట్టారు.
Lakshmi Machine Works: కంపెనీలో సోనాల్ షాకు 1.75 కోట్ల రూపాయల వాటా ఉంది.
Hindustan Unilever: అమిత్ షా కంపెనీలో రూ.1.35 కోట్ల విలువైన వాటాను కలిగి ఉన్నారు.
MRF: అమిత్ షా టైర్ తయారీదారు రూ.1.29 కోట్ల విలువైన 100 షేర్లకు యజమాని.
Bharti Airtel: టెలికాం కంపెనీలో సోనాల్ షా రూ.1.22 కోట్ల షేర్లను కలిగి ఉన్నారు.
Colgate-Palmolive: ఈ కంపెనీలో అమిత్ షా పెట్టుబడి దాదాపు రూ.1.07 కోట్లు.
Sun Pharma: ఈ ఫార్మా కంపెనీలో సోనాల్ షా వాటా కోటి రూపాయలకు పైగా ఉంది.
అమిత్ షా ఈక్విటీ పోర్ట్‌ఫోలియోను నిశితంగా సమీక్షిస్తే.. ABB ఇండియా, ఐటీసీ, విఐపీ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, గ్రైండ్‌వెల్ నార్టన్, కమిన్స్ ఇండియా, కాన్సాయ్ నెరోలాక్ పెయింట్స్ మరికొన్ని కంపెనీల్లో షేర్లను కలిగి ఉన్నారు. అమిత్ షా తన పెట్టుబడి ఎంపికల్లో బ్యాంకింగ్, FMCG రంగాలకు ప్రాధాన్యతనిచ్చారు. వీరిద్దరి ఆస్తుల విలువ కలిపి రూ.65.67 కోట్లుగా అఫిడవిట్ లో పేర్కొన్నారు. నగదు, బ్యాంకు పొదుపులు, స్టాక్స్‌లో పెట్టుబడులు, డిపాజిట్లు, బంగారం, వెండి ఆభరణాలు సహా సోనాల్ షాకు చెందిన చరాస్తుల విలువ రూ.22.5 కోట్లకుపైగా ఉంటుందని, ఆభరణాల విలువ రూ.1.10 కోట్లకు పైగా ఉన్నట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications