For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold price today: మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు

|

బంగారం ధరలు క్రితం సెషన్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. నేడు మరింతగా క్షీణించాయి. దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో పసిడి ధరలు రూ.51,000కు దిగువన, అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో 1830 డాలర్లకు దిగువన ఉంది. బంగారం ధరలు గత కొద్ది నెలలుగా 1800 డాలర్ల నుండి 1890 డాలర్ల మధ్య కదలాడుతున్నాయి. ఎంసీఎక్స్‌లో ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.5500 వరకు తక్కువగా ఉంది.

నేడు (జూన్ 22, 2022) ప్రారంభ సెషన్‌లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.147 తగ్గి రూ.50,613 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.134 తగ్గి రూ.50,873 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ జూలై రూ.729 తగ్గి రూ.60,542 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.751 తగ్గి రూ.61,306 వద్ద ట్రేడ్ అయింది.

Gold price falls Rs 150, silver down rs 730

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో నేడు కూడా పసిడి ధరలు భారీగా తగ్గాయి. దాదాపు పది డాలర్ల మేర క్షీణించింది. ఈ వార్త రాసే సమయానికి 10 డాలర్ల వరకు తగ్గి 1829 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.373 డాలర్లు క్షీణించి 21.395 డాలర్ల వద్ద కదలాడింది. బంగారం ధరలు ఈవారం తగ్గే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

English summary

Gold price today: మళ్లీ తగ్గుతున్న బంగారం, వెండి ధరలు | Gold price falls Rs 150, silver down rs 730

Gold prices went down in Wednesday's early trade from the previous day's rate by Rs 100, with 10 gram of yellow metal selling at Rs 51,980.
Story first published: Wednesday, June 22, 2022, 10:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X