For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold prices: అక్కడ భారీగా తగ్గిన బంగారం ధరలు, ఇక్కడ రూ.50,000కు పైనే

|

బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో తగ్గుతున్నట్లు స్పష్టంగా కనిపించినప్పటికీ, ఇటీవల దిగుమతి సుంకాలు పెంచడంతో ఇక్కడ ఆ మేరకు ప్రయోజనం కనిపించడం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో గత కొద్ది సెషన్‌లలోనే పసిడి ధరలు 70 డాలర్లకు పైగా తగ్గింది. మన వద్ద మాత్రం దిగుమతి సుంకాలు పెరగడంతో రూ.1000 వరకు మాత్రమే ఊరట దక్కింది.

దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.56 పెరిగి రూ.50,677 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.91 పెరిగి 51,000 వద్ద ట్రేడ్ అయ్యాయి. సిల్వర్ ఫ్యూచర్స్ సెప్టెంబర్ రూ.190 తగ్గి రూ.56,825 వద్ద, డిసెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.148 తగ్గి రూ.57,751 వద్ద ట్రేడ్ అయింది. గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,000 దిగువకు వచ్చింది. దిగుమతి సుంకాలు పెంచకుంటే రూ.50,000 దిగువకు వచ్చి ఉండేది.

Gold prices: Gold prices inch higher as dollar softens

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 0.20 శాతం పెరిగి 1739.85 వద్ద, సిల్వర్ ఫ్యూచర్ ధరలు 0.071 శాతం తగ్గి 19.117 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లు కాగా, ప్రస్తుతం 1740 డాలర్ల దిగువన ఉంది. అంటే ఆల్ టైమ్ గరిష్టంతో 340 డాలర్ల వరకు తక్కువగా ఉంది. అమెరికా సహా వివిధ దేశాల వడ్డీ రేట్లు పెరగడం పసిడిపై ప్రభావం చూపాయి. దీంతో ధరలు తగ్గాయి.

English summary

Gold prices: అక్కడ భారీగా తగ్గిన బంగారం ధరలు, ఇక్కడ రూ.50,000కు పైనే | Gold prices: Gold prices inch higher as dollar softens

Pressure on international gold prices exerted by US inflation, consequent interest rate hikes and a strong dollar has apparently checked a rise in the price of the precious metal in India after a recent hike in its import duty, much to the relief of jewellers.
Story first published: Friday, July 8, 2022, 10:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X