For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Prices Today: భారీగా పెరిగిన బంగారం ధర, రూ.1350 జంప్

|

బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా క్షీణించినప్పటికీ, దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో మాత్రం దాదాపు స్థిరంగా ఉన్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో పసిడి ధరలు చాలా రోజులుగా రూ.51,000కు కాస్త దిగువనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో మాత్రం 1850 డాలర్ల స్థాయి నుండి 1800 డాలర్ల స్థాయికి దిగి వచ్చాయి. ఈ లెక్కన మన వద్ద పసిడి ధరలు భారీగా తగ్గాల్సి ఉంది. కానీ డాలర్ మారకంతో రూపాయి బలహీనపడటం ప్రభావం చూపింది.

గోల్డ్ ఫ్యూచర్స్ అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా కాస్త తగ్గుతున్నప్పటికీ, రూపాయి బలహీనపడుతుండటంతో ఆ స్థాయిలో తగ్గడం లేదు. నిన్న అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ డబుల్ డిజిట్‌లో తగ్గింది. కానీ మన వద్ద స్వల్పంగా మాత్రమే క్షీణించింది. నిన్న గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50,700కు దిగువన ముగిసింది. కానీ నేడు మాత్రం భారీగా జంప్ చేసింది.

Gold Prices Today: Yellow metal jumps RS 1350 to near RS 52000

నిన్న రూ.51,000 దిగువన ఉన్న పసిడి, ఇప్పుడు ఏకంగా రూ.52,000 సమీపానికి చేరుకుంది. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో రూ.1363 పెరిగి రూ.51880 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ కూడా రూ.1302 పెరిగి రూ.52,090 వద్ద కదలాడింది. నిన్న రూ.58,500 దిగువకు పడిపోయిన సిల్వర్ ఫ్యూచర్స్ నేడు రూ.370 పెరిగి రూ.58700 వద్ద కదలాడింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం పసిడి 1801 డాలర్లకు దిగి వచ్చింది. గోల్డ్ ఫ్యూచర్స్ నిన్న 1807 డాలర్ల వద్ద ముగియగా, నేడు 6 డాలర్లు క్షీణించి 1801 డాలర్ల వద్ద కదలాడింది. సిల్వర్ ఫ్యూచర్స్ 20 డాలర్ల కిందకు వచ్చింది. నేడు 0.375 డాలర్లు క్షీణించి 19.980 వద్ద కదలాడింది.

English summary

Gold Prices Today: భారీగా పెరిగిన బంగారం ధర, రూ.1350 జంప్ | Gold Prices Today: Yellow metal jumps RS 1350 to near RS 52000

Weaker Rupee to hold yellow metal slide domestically. Gold August future jumped RS 1363 to RS 51,880 today.
Story first published: Friday, July 1, 2022, 10:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X