IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
TCS News: టీసీఎస్ ఏదీ కూడా జోక్ గా చెప్పదని మరోసారి స్పష్టమైంది. గతంలో కంపెనీ తన 6 లక్షల మంది ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందేనని ఆందేశించిన సంగతి తెలిసిందే.
ఇటీవల టీసీఎస్ హైక్స్ పరిశీలిస్తే.. వర్క్ ఫ్రమ్-ఆఫీస్ నిబంధనలను పాటించని TCS ఉద్యోగులు ఆఫీసుకు హాజరై క్రమశిక్షణతో ఉన్న వారితో పోలిస్తే తక్కువ వేతన పెంపును అందుకున్నట్లు తాజాగా వెల్లడైంది. దీంతో చాలా మంది టీసీఎస్ ఉద్యోగులు షాక్ అయ్యారు. ప్రస్తుతం ఆఫీసులకు తిరిగి వచ్చిన తర్వాత సహోద్యోగుల కంటే తక్కువ శాలరీ హైక్ పొందిన టెక్కీలు లబోదిబోమంటున్నారు.

టెక్ దిగ్గజం టీసీఎస్ ఈసారి వేతన పెంపుల ప్రకటన చేయటానికి ముందు వారి పనితీరుతో పాటు ఆఫీసులకు హాజరు వివరాలను సైతం కొలమానంగా తీసుకుంది. గతంలో తాను ఉద్యోగులకు చెప్పినట్లుగానే వర్క్ ఫ్రమ్ ఆఫీసును పాటించేవారికి అధిక వేతనాలను ఇతర ప్రయోజనాలను అందించటం ఇప్పుడు టెక్ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. మాట వినని టెక్కీలను దారిలోకి తీసుకొచ్చేందుకు టాప్ ఐటీ సేవల కంపెనీ చేసిన ప్రయత్నాన్ని ఇతర టెక్ కంపెనీలు సైతం రానున్న కాలంలో అమలు చేసే అవకాశాలు ఉన్నట్లు ఈ రంగానికి చెందిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కరోనా తర్వాత చాలా మంది ఇంటి నుంటే పనిచేయటానికి ఇష్టపడ్డారు. అయితే పరిస్థితులు మారుతున్న వేళ టెక్ కంపెనీలు తమ పనితీరును అత్యుత్తమంగా మార్చుకునేందుకు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రావాల్సిందిగా ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే టెక్ కంపెనీలు తగ్గిన ప్రాజెక్టులతో పాటు మార్చిన్ల ఒత్తిడితో లాభదాయకతను కాపాడుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications