For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Prices Today: రూ.51,000 స్థాయిలోనే బంగారం ధరలు

|

బంగారం ధరలు గత కొద్ది రోజులుగా దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో రూ.51,000 సమీపంలో, అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో 1810 డాలర్ల నుండి 1880 డాలర్ల స్థాయిలో కదలాడుతున్నాయి. ఎక్కువగా 1850 డాలర్లకు కాస్త అటు ఇటు కనిపిస్తున్నాయి. భారీగా పెరుగుతూనే, మళ్లీ అంతే స్థాయిలో తగ్గుతున్నాయి. పసిడి ధరలు ఇటీవల తీవ్ర ఊగిసలాటలో ఉన్నాయి. ఆల్ టైమ్ గరిష్టం రూ.56200తో పోలిస్తే రూ.5200 వరకు తక్కువగా ఉన్నాయి.

నేడు (జూన్ 17, 2022) ఉదయం గం.11 సమయానికి ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.17 పెరిగి రూ.51,003 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.36 పెరిగి రూ.51,277 వద్ద ట్రేడ్ అయింది. జూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.66 తగ్గి రూ.61,461 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.60 తగ్గి రూ.62,248 వద్ద ట్రేడ్ అవుతోంది.

Gold Prices Today: Yellow metal fall, set for biggest weekly drop in a month

అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు 1850 డాలర్లకు సమీపంలోనే ఉన్నాయి. చాలా రోజులుగా ఈ స్థాయిలోనే ఎక్కువగా కదలాడుతోంది. గోల్డ్ ఫ్యూచర్ (ఆగస్ట్ 22) 0.60 డాలర్లు తగ్గి 1849.40 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.048 డాలర్లు తగ్గి 21.933 డాలర్ల వద్ద కదలాడింది. బంగారం ధరలు నేడు స్వల్పంగా క్షీణించాయి. ఈ నెలలో మొదటి రెండు వారాలు ధరలు పెరిగాయి. ఆ తర్వాత తగ్గాయి. నేడు కూడా ధరలు క్షీణిస్తే ఈ నెలలో గరిష్ట తగ్గుదల అవుతుంది.

English summary

Gold Prices Today: రూ.51,000 స్థాయిలోనే బంగారం ధరలు | Gold Prices Today: Yellow metal fall, set for biggest weekly drop in a month

Gold fell on Friday, as a higher dollar and rising US Treasury yields weighed on demand for greenback priced bullion, and put prices on track for their biggest weekly drop since mid May.
Story first published: Friday, June 17, 2022, 11:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X