For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Prices Today: ఆ మార్క్ దిగువనే బంగారం ధర, కానీ రూపాయి క్షీణతతో...

|

బంగారం ధరలు దాదాపు స్థిరంగా ఉంటున్నాయి. నిన్న భారీగా పెరిగిన పసిడి ధరలు నేడు (జూన్ 29) దాదాపు స్థిరంగా ఉన్నాయి. ఇప్పటికీ రూ.51,000కు దిగువనే ఉన్నాయి. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 221 పెరిగి రూ.50,870 వద్ద ముగియగా, సిల్వర్ ఫ్యూచర్స్ రూ.60,000 డాలర్ల దిగువకు వచ్చింది. నిన్న సిల్వర్ ఫ్యూచర్స్ రూ.300 వరకు తగ్గి రూ.59,649 వద్ద ఉంది. బంగారం, వెండి ధరలు గత కొద్ది రోజులుగా రూ.51,000కు అటు ఇటుగా, రూ.62,000 దిగువన ఉంటున్నాయి.

ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ నేటి ప్రారంభ సెషన్‌లో అతి స్వల్పంగా రూ.20 తగ్గి రూ.50802 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.44 తగ్గి రూ.51,046 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ నేడు మరింత క్షీణించింది. ఉదయం సెషన్‌లోజూలై సిల్వర్ ఫ్యూచర్స్ రూ.219 తగ్గి రూ.59,320 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.193 తగ్గి రూ.60,000 వద్ద ట్రేడ్ అయింది.

Gold Prices Today: Yellow metal to find support from weak rupee

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ నేటి సెషన్‌లో 1821 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ 21 డాలర్ల దిగువకు వచ్చింది. ఈ వార్త రాసే సమయానికి 20.855 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. బంగారం ఆల్ టైమ్ గరిష్టం 2075 డాలర్లతో పోలిస్తే 175 డాలర్ల వరకు తక్కువగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం బంగారం ధరలు కాస్త పెరిగాయి. అమెరికా ట్రెజరీ దిగుబడులు తక్కువగా ఉండటం ప్రభావం చూపుతోంది. డాలర్ పెరుగుదల బంగారంపై ఒత్తిడిని పెంచుతోంది. మరోవైపు మన దేశంలో రూపాయి డాలర్ మారకంతో క్షీణిస్తోంది. ఇది మున్ముందు బంగారం ధరల మద్దతుకు సానుకూలంగా కనిపిస్తోంది.

English summary

Gold Prices Today: ఆ మార్క్ దిగువనే బంగారం ధర, కానీ రూపాయి క్షీణతతో... | Gold Prices Today: Yellow metal to find support from weak rupee

Gold prices treaded water on Wednesday in the international markets, with lower US Treasury yields lending support, as bullion's struggle to break out of its range-bound trade continued.
Story first published: Wednesday, June 29, 2022, 11:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X