For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు నేడు ఎలా ఉన్నాయంటే, మున్ముందు తగ్గుతాయా?

|

బంగారం ధరలు రూ.51,000కు దిగువనే ఉన్నాయి. క్రితం సెషన్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ రూ.50,800 స్థాయిలో ముగిసింది. పసిడి ధరలు గత కొద్ది వారాలుగా దేశీయ ఫ్యూచర్ మార్కెట్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(MCX)లో రూ.51,000 స్థాయిలో, అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో 1810 డాలర్ల నుండి 1890 డాలర్ల దిగువన కదలాడుతున్నాయి. ఇటీవల 1830 డాలర్ల కిందకు వచ్చింది. పసిడి ధరలు మున్ముందు మరింత క్షీణించే అవకాశాలున్నాయి.

ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ క్రితం సెషన్‌లో రూ.50,720 వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ రూ.60,675 వద్ద ముగిసింది. నేడు ప్రారంభ సెషన్‌లోను గోల్డ్ ఫ్యూచర్ ధరలు పెరిగాయి. అయినప్పటికీ రూ.51,000కు దిగువనే ఉన్నాయి. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ ఉదయం రూ.50,789 వద్ద, అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.51,000 వద్ద ట్రేడ్ అయ్యాయి. సిల్వర్ ఫ్యూచర్స్ జూన్ రూ.233 పెరిగి రూ.60,179 వద్ద, సెప్టెంబర్ సిల్వర్ ఫ్యూచర్స్ రూ.152 పెరిగి రూ.60,724 వద్ద ట్రేడ్ అయింది. సిల్వర్ ఫ్యూచర్స్ రూ.60,000 క్రాస్ చేసింది.

Gold Price at around Rs 50,800: Will it decrease soon?

అంతర్జాతీయ మార్కెట్ కామెక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ 1830 డాలర్లకు దిగువనే ఉన్నాయి. గోల్డ్ ఫ్యూచర్స్ (ఆగస్ట్ 22) నేటి సెషన్‌లో 2.75 డాలర్లు లాభపడి 1827 డాలర్ల వద్ద, సిల్వర్ ఫ్యూచర్స్ 0.016 డాలర్లు ఎగిసి 21.203 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది.

English summary

బంగారం ధరలు నేడు ఎలా ఉన్నాయంటే, మున్ముందు తగ్గుతాయా? | Gold Price at around Rs 50,800: Will it decrease soon?

Gold price jumped on Monday, tracking firm global cues. On the MCX, the gold futures climbed 0.38 per cent to Rs 50,813 for 10 grams at 0950 hours on June 27.
Story first published: Tuesday, June 28, 2022, 10:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X