For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

4 నెలల తర్వాత రికార్డుల మోత, ఐదో రోజూ ఎగిరి గంతేసిన స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో పరుగులు తీస్తున్నాయి. హెవీ వెయిట్స్ నుంచి లభిస్తున్న మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీ సెంటిమెంట్ మార్కును క్రాస్ చేసి ఇన్వెస్టర్లలో జోష్ నింపుతున్నాయి.

By bharath
|

స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో పరుగులు తీస్తున్నాయి. హెవీ వెయిట్స్ నుంచి లభిస్తున్న మద్దతుతో సెన్సెక్స్, నిఫ్టీ సెంటిమెంట్ మార్కును క్రాస్ చేసి ఇన్వెస్టర్లలో జోష్ నింపుతున్నాయి. నిఫ్టీ నాలుగు నెలల తర్వాత మళ్లీ 11000 పాయింట్ల మార్కును, సెన్సెక్స్ 37000 పాయింట్ల మార్కును దాటింది. రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్, జీ, బజాజ్ ఫైనాన్స్, టెక్మహీంద్రా స్టాక్స్ నుంచి వచ్చిన మద్దతుతో సూచీలు జోరుమీదున్నాయి.

4 నెలల తర్వాత రికార్డుల మోత, ఐదో రోజూ ఎగిరి గంతేసిన స్టాక్ మార్కెట్

ఉదయం స్వల్ప లాభాల్లో మొదలైన సూచీలకు మిడ్ సెషన్ తర్వాత పరుగులు తీశాయి. చివరకు 128 పాయింట్ల లాభంతో 11062 దగ్గర నిఫ్టీ, 358 పాయింట్ల లాభంతో 36975 దగ్గర సెన్సెక్స్ క్లోజైంది.

అన్ని రంగాల సూచీలూ లాభాల్లోనే..
మార్కెట్ పరుగుకు అన్ని రంగాల సూచీలు లాభాల్లోకి వచ్చాయి. ఉదయం ఫార్మా, ఐటి
రంగ స్టాక్స్‌లో కొద్దిగా నిస్తేజం కనిపించినా చివరకు అవి కూడా గ్రీన్‌లోకి వచ్చాయి. ప్రధానంగా మీడియా, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో రంగ కౌంటర్లకు కొనుగోళ్ల మద్దతు కనిపించింది. ప్రైవేట్ బ్యాంక్స్, ఎఫ్‌ఎంసిజి మాత్రమే కాస్త దిగాలుగా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం మార్కెట్లకు పెద్దగా సహకరించలేదు. అదే ఈ రోజు హైలైట్.

టెక్ మహీంద్రా, జీ జోరు
మెరుగైన త్రైమాసిక ఫలితాలను వెల్లడించిన టెక్ మహీంద్రా అదే ఊపును కనబరుస్తోంది. ఈ రోజు ట్రేడ్‌లో ఏకంగా 9 శాతం వరకూ పెరిగింది. చివరకు రూ.811 దగ్గర క్లోజైంది.

ఇక రుణదాతలకు వ్యక్తిగత పూచీ హామీ తర్వాత జీ ఎంటర్‌టైన్‌మెంట్ స్టాక్స్ కొద్దిగా
తేరుకున్నాయి. చివరకు 7 శాతం లాభాలతో రూ.388 దగ్గర ముగిసింది. ఇదే బాటలో బంధన్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్, సన్ నెట్వర్క్ స్టాక్స్ 5 శాతం వరకూ పెరిగాయి.

అడాగ్‌ బాధలు అన్నీఇన్నీ కావు
అనిల్ ధీరూభాయ్ సంస్థల స్టాక్స్‌లో నష్టాలకు బ్రేక్ పడ్తున్నదాఖలాలే లేవు. ఈ రోజు కూడా రిలయన్స్ ఇన్ఫ్రా 32 శాతం నష్టపోయి రూ.154 దగ్గర క్లోజైంది. రిలయన్స్ హోం ఫైనాన్స్ 9 శాతం, రిలయన్స్ క్యాపిటల్ ఐదున్నర శాతం కోల్పోయాయి. మరికొద్ది రోజులు ఇలానే కొనసాగేట్టుంది. కొద్దోగొప్పో రిలయన్స్ క్యాపిటల్‌లో స్వల్ప పుల్ బ్యాక్ రావొచ్చని టెక్నికల్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు.

వీటిల్లో ఉత్సాహం మామూలుగా లేదు

మిడ్, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ట్రెండ్ దిగాలుగా ఉన్నప్పటికీ కొన్ని స్టాక్స్ మాత్రం ఆల్ టైం హై స్థాయిని నమోదు చేస్తున్నాయి. ఈ బాటలో యాక్సిస్ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, బాటా ఇండియా, ఇన్ఫోసిస్, డా.లాల్‌ప్యాథ్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా, యూపీఎల్, విప్రో వంటి స్టాక్స్ ఉన్నాయి.

Read more about: stock markets sensex nifty
English summary

4 నెలల తర్వాత రికార్డుల మోత, ఐదో రోజూ ఎగిరి గంతేసిన స్టాక్ మార్కెట్ | Stock Market Closing News

Nifty clocked best five day rally over the past four months. Sensex today crossed 37000 mark comfortably and settled in a positive terittory. But the market breadth is in favour of sellers still.
Story first published: Wednesday, February 6, 2019, 16:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X