Closing Bell: ఉదయం ఉల్లాసంగా లాభాల్లో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి నేడు నష్టాల్లోనే తమ ప్రయాణాన్ని ముగించాయి. దీంతో వరసగా నాలుగో రోజు సైతం మార్కెట్లు బేర్ల చేతిలో చిక్కుకున్నాయి.
నేడు మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 455 పాయింట్లు నష్టంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 152 పాయింట్ల మేర నష్టాన్ని చవిచూసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 415 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 241 పాయింట్ల మేర నష్టపోయింది. ప్రధానంగా ఇన్వెస్టర్ల చూపు ప్రస్తుతం క్యూ4 ఫలితాలు, బాండ్ ఈల్డ్ కర్వ్ ట్రెండ్లపై కొనసాగుతోంది. మార్కెట్ల క్లోజింగ్ సమయానికి టెలికాం, మీడియా రంగాల్లోని షేర్లు లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎమ్సీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు మార్కెట్లను నష్టాల్లోకి లాగాయి.

మార్కెట్ల క్లోజింగ్ సమయంలో ఎన్ఎస్ఈలో ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, బజాజ్ ఆటో, హిందాల్కొ, ఇన్ఫోసిస్, ఎల్ టిఐఎమ్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా కన్జూమర్, ఎల్‌టి, ఐషర్ మోటార్స్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ గెయినర్లుగా నిలిచి లాభాలతో ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో అపోలో హాస్పిటల్స్, నెస్లే, టైటాన్, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, దివీస్ ల్యాబ్, ఎన్టీపీసీ, టాటా మోటార్స్, ఐటీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, హీరో మోటార్స్, డాక్టర్ రెడ్డీస్, ఐసీఐసీఐ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి నేడు టాప్ లూజర్లుగా చివరికి నిలిచాయి.


Click it and Unblock the Notifications