Stock Market: ఏప్రిల్ నెల చివరికి వస్తున్న వేళ దేశంలోని కార్పొరేట్ కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను ఒకదాని తర్వాత మరొకటి ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస ట్రేడింగ్ సెషన్లలో నష్టాలను నమోదు చేశాయి. అయితే ఇప్పుడు అందరి చూపు రానున్న వారం మార్కెట్లపైనే ఉంది.
ఈ క్రమంలో కొన్న గమనించాల్సిన కీలక అంశాలను గమనిస్తే.. ముందుగా దేశీయంగా ఇన్వెస్టర్ల చూపు కంపెనీలు విడుదల చేస్తున్న మార్చి క్యూ4 ఫలితాలపై ఉంది. దీని తర్వాత దేశంలో జరుగుతున్న లోక్ సభ ఎన్నికలు 2024 దేశీయంగా గమనించాల్సిన అంశాలుగా ఉన్నాయి. అలాగే మార్కెట్లను ప్రభావితం చేసే గ్లోబల్ కారణాలను పరిశీలిస్తే.. ముందుగా ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు, పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, అమెరికా బాండ్ ఈల్డ్స్ కీలకంగా మారనున్నాయి. ఇదే సమయంలో బంగారం ధరలు గ్లోబల్ మార్కెట్లలో ఎన్నడూ చూడనిరీతిలో ర్యాలీని కొనసాగిస్తున్నాయి. డాలర్-రూపాయి మారకపు విలువసైతం భారీగా పతనమైంది.

గడచిన వారంలో అమెరికాలోని ఐటీ రంగం షేర్లు 4.71 శాతం క్షీణించాయి. ఇది గత 12 నెలల కాలంలో రెండవ అతిపెద్ద పతనం కావటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు నెలకొన్నాయి. దీనికి తోడు వరుసగా దేశీయ ఐటీ కంపెనీల ఫలితాలు బలహీనమైన ఆర్థిక ఫలితాలను విడుదల చేయటం తీవ్రమైన పరిస్థితులకు అద్ధంపడుతోంది.
ఇక ప్రైమరీ మార్కెట్ల విషయానికి వస్తే.. మెయిన్‌బోర్డ్, చిన్న-మధ్యతరహా ఎంటర్‌ప్రైజెస్ విభాగంలో కొన్ని ఐపీవోలు లిస్టింగ్ అయ్యాయి. ఇన్వెస్టర్లు ఆర్థిక సూచికలు, తాజా కార్పొరేట్ ఫలితాలపై దృష్టి సారిస్తారు కాబట్టి ఈ వారం దేశీయ మార్కెట్లుసాంకేతిక కోణం నుంచి క్లిష్టమైనది. మొత్తంమీద త్రైమాసిక ఫలితాలపై అస్థిరత కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
రానున్న వారంలో 4 కంపెనీల ఐపీవోలు కొత్తగా వస్తుండగా.. 5 కంపెనీల ఐపీవోలు లిస్టింగ్ కోసం మార్కెట్లోకి అరంగేట్రం చేస్తున్నాయి. ఈ వివరాల ప్రకారం ఈవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఓలటాలిటీ కొనసాగుతుందని అంచనా వేస్తున్న నిపుణులు.. ఇన్వెస్టర్లను జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.


Click it and Unblock the Notifications