Market Closing: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. మరి ఇన్వెస్టర్ల దారెటు..??
Closing Bell: ఉదయం నష్టాల్లో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి భారీ నష్టాల్లోనే నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో ఓఎన్జీసీ, ఎక్సైడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీల షేర్లు భాగా యాక్టివ్‌గా కొనసాగాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 845 పాయింట్లను కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 242 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 817 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 787 పాయింట్లను కోల్పోయింది. ఈ క్రమంలో మార్కెట్లను నేడు ఐటీ, బ్యాంకింగ్ రంగాలకు చెందిన కంపెనీలు నష్టాల్లోకి లాగగా.. ఆయిల్ అండ్ గ్యాస్ స్టాక్స్ మార్కెట్లకు అండగా నిలిచాయి. ఈ క్రమంలో బీఎస్ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు ఏకంగా 1.5 శాతం మేర క్షీణతను నమోదు చేశాయి.

మార్కెట్లు ముగిసే సమయంలో ఓఎన్జీసీ, హిందాల్కొ, మారుతీ, నెస్లే, బ్రిటానియా, ఎయిల్ టెల్ కంపెనీల షేర్లు లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి. ప్రధానంగా యుద్ధ వాతావరణం అలుముకున్న వేళ ఇన్వెస్టర్లు ముందస్తు అప్రమత్తతగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవటంతో చాలా కంపెనీల షేర్లు నేడు నష్టాల్లోనే రోజును ముగించాయి.
ఇదే క్రమంలో శ్రీరామ్ ఫైనాన్స్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఎల్ టి, అదానీ ఎంటర్ ప్రైజెస్, బీపీసీఎల్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, టాటా కన్జూమర్, ఎల్ టిఐఎమ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications