Closing Bell: ఉదయం లాభాల ప్రారంభాన్ని నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి బంపర్ ర్యాలీతో క్లోజ్ అయ్యాయి. ఈ క్రమంలో నేడు ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాల షేర్లు మంచి ర్యాలీని నమోదు చేశాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 354 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 111 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 256 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 486 పాయింట్ల మేర లాభంతో ప్రయాణాన్ని ముగించింది. రేపు దేశవ్యాప్తంగా రంజాన్ పండుగ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు సెలవులో ఉండనున్నాయి.

ఎన్ఎస్ఈలో కోల్ ఇండియా, బీపీసీఎల్, కోటక్ బ్యాంక్, హిందాల్కొ, ఐటీసీ, ఎయిర్ టెల్, ఎస్బీఐ, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, ఐషర్ మోటార్స్, టాటా కన్జూమర్, టెక్ మహీంద్రా, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, నెస్లే, టీసీఎస్, టైటాన్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో హెచ్డీఎఫ్సీ లైఫ్, సిప్లా, మారుతీ, దివీస్ ల్యాబ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ ఫైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎల్‌టి, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటార్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ ఫిన్ సర్వ్, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేర్లు టాప్ లూజర్లుగా నేడు నిలిచాయి.


Click it and Unblock the Notifications