Closing Bell: ఉదయం ఉల్లాసంగా ట్రేడింగ్ ప్రారంభించిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి అదే ఊపులో నేడు క్లోజ్ అయ్యాయి. మార్కెట్లు ముగింపు సమయానికి జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి.
మార్కెట్ల ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 115 పాయింట్లు లాభపడగా.. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో నేడు ప్రయాణాన్ని ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 219 పాయింట్లు లాభంలో క్లోజ్ కాగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 377 పాయింట్లు గెయిన్ అయ్యింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్‌లో తమ లాభాల జోరును కొనసాగించాయి. హిందాల్కొ, సిప్లా కంపెనీల షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి.

ఎన్ఎస్ఈలో హిందాల్కొ, సిప్లా, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, కోటక్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, హీరో మోటార్స్, దివీస్ ల్యాబ్, ఎన్టీపీసీ, అపోలో హాస్పిటల్స్, యాక్సిస్ బ్యాంక్, ఎల్ టి, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, బ్రిటానియా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో టాటా కన్జూమర్, గ్రాసిమ్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్, టీసీఎస్, అదానీ ఎంటర్ ప్రైజెస్, మారుతీ, టైటాన్, ఎస్బీఐ లైఫ్, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఎయిర్ టెల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందుస్థాన్ యూనీలివర్, ఎస్బీఐ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications