Market Closing: లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. మెరిసిన రియల్టీ, మెటల్, ఆటో స్టాక్స్..
Closing Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు సానుకూల పవనాల మధ్య నేడు సూపర్ ర్యాలీని చూశాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ నిఫ్టీలు ఇంట్రాడేలో సరికొత్త రికార్డు గరిష్ఠాలను నమోదు చేసి చివరికి భారీ లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 494 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 153 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 89 పాయింట్లు పెరగగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 19 పాయింట్ల మేర లాభంతో చివరికి తన ప్రయాణాన్ని సానుకూలంగా ముగించాయి. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో ఆటో, మెటల్, రియల్టీ రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్ల కోలాహలం కొనసాగింది.

ఎన్ఎస్ఈలో ఐషర్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, గ్రాసిమ్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా కన్జూమర్, ఎల్ టి, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్స్, ఎయిర్ టెల్, హిందాల్కొ, పవర్ గ్రిడ్, దివీస్ ల్యాబ్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
ఇదే క్రమంలో అదానీ పోర్ట్స్, నెస్లే, అపోలో హాస్పిటల్స్, విప్రో, సన్ ఫార్మా, ఎల్ టిఐఎమ్, టీసీఎస్, టైటాన్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్, హెచ్సీఎల్ టెక్నలజీస్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications