Closing Bell: ఉదయం నిరాశగా మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతాన్ని లాభంలో ముగించాయి. కీలక బెంచ్ మార్క్ సూచీలు ఇంట్రాడేలో రెండవ సెషన్లో నష్టాల నుంచి పుంజుకుని లాభాల బాట పట్టాయి. అయితే రానున్న కాలంలో మార్కెట్లు క్షీణిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సాయంత్రం ట్రేడింగ్ ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 599 పాయింట్ల లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 151 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 505 పాయింట్ల మేర లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 299 పాయింట్ల నష్టంలో తన ప్రయాణాన్ని నేడు ముగించింది. ఇన్వెస్టర్లు ప్రధానంగా దేశీయ కార్పొరేట్ కంపెనీల క్యూ4 ఫలితాలతో పాటు పెరుగుతున్న యూఎస్ బాండ్ ఈల్డ్స్ విదేశీ మదుపరులను భారత స్టాక్ మార్కెట్లకు దూరంగా జరిగేలా చేస్తున్నాయి.

ఎన్ఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎయిర్ టెల్, గ్రాసిమ్, విప్రో, బజాజ్ ఫిన్ సర్వ్, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, హిందుస్థాన్ యూనీలివర్, ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని నేడు ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్, నెస్లే, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టి, టీసీఎస్, బీపీసీఎల్, హీరో మోటార్స్, ఎల్ టిఐఎమ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా మోటార్స్, కోల్ ఇండియా, బ్రిటానియా, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, ఐషర్ మోటార్స్, సిప్లా, శ్రీరామ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications