Closing Bell: దేశంలోని కార్పొరేట్ కంపెనీలు తమ క్యూ4 ఫలితాలను వరుసగా విడుదల చేస్తున్న వేళ ఈక్విటీ మార్కెట్లలో జోష్ కొనసాగుతోంది. ఈ క్రమంలో నేడు బెంచ్ మార్క్ సూచీలు తమ ప్రయాణాన్ని లాభాల్లో నేడు ముగించాయి.
మార్కెట్ల క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 560 పాయింట్ల లాభంలో ప్రయాణం ముగించగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 189 పాయింట్లు గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 351 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 399 పాయింట్ల లాభంతో నేడు ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో ఆటో, పీఎస్‌యూ బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, జీఎంసీజీ, హెల్త్‌కేర్, రియాల్టీ సూచీలు 1-3 శాతం మధ్య పెరగడంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి.

మిడిల్ ఈస్ట్ టెన్షన్‌కు కొంత ఉపశమనం లభించినందున గత శుక్రవారం నాటి ఉపశమన ర్యాలీని భారత మార్కెట్ నేడు కొనసాగించాయని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు. ఈ క్రమంలో టాటా కన్జూమర్, బీపీసీఎల్, ఎల్ టి, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, హీరో మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ లైఫ్, విప్రో, కోల్ ఇండియా, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, సన్ ఫార్మా, అదానీ ఎంటర్ ప్రైజెస్, దివీస్ ల్యాబ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఆటో కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాన్ని నేడు ముగించాయి.


Click it and Unblock the Notifications