Market Closing: ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు మెుత్తానికి చివరికి ర్యాలీ నుంచి జారి నష్టాల్లో నేడు ట్రేడింగ్ ముగించాయి. ప్రధానంగా ఓలటాలిటీతో పాటు ఆటో, ఎఫ్ఎంసీజీ షేర్లు నష్టాలకు దారితీశాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 59 పాయింట్లు నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 24 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడింగ్ ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 149 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 146 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ క్రమంలో బ్యాంకింగ్, మెటల్ రంగాల్లోని షేర్లు లాభదాయకంగా ప్రయాణాన్ని ముగించాయి.

ఎన్ఎస్ఈలో అపోలో హాస్పిటల్స్, హిందాల్కొ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, నెస్లే, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, మారుతీ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో టైటాన్, హీరో మోటార్స్, కోల్ ఇండియా, రిలయన్స్, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా కన్జూమర్, శ్రీరామ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎస్బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, విప్రో, ఎల్ టి, బ్రిటానియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, టీసీఎస్, టాటా మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.


Click it and Unblock the Notifications