Closing Bell: ఉదయం నుంచి అమ్మకాల ఒత్తిడిని కొనసాగించిన తర్వాత చివరికి బెంచ్ మార్క్ సూచీలు నేడు నష్టాల్లోనే తమ ప్రయాణాన్ని ముగించాయి. ఇన్వెస్టర్లలో అలుముకున్న భయాలు వారిని సేఫ్ గేమ్ ఆడేలా ప్రేరేపిస్తున్నాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 456 పాయింట్లను కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 125 పాయింట్లను నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 288 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 44 పాయింట్లను కోల్పోయాయి. మరో పక్క బాండ్ ఈల్డ్స్ పెరుగుదల మార్కెట్లపై ఒత్తిడిని భారీగా పెంచేస్తున్నాయి. ప్రధానంగా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య రోజురోజుకూ ముదురుతున్న వివాదం అనిశ్చితులను పెంచుతోంది.ఇలాంటి పరిస్థితుల్లో విశ్లేషకులు పెట్టుబడిదారులకు జాగ్రత్తగా ఉండాలని, పరిణామాలు ఎలా జరుగుతాయో వేచి చూడాలని సూచిస్తున్నారు.

ఎన్ఎస్ఈలో మార్కెట్ల క్లోజింగ్ సమయానికి ఐషర్ మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, ఓఎన్జీసీ, టైటాన్, దివీస్ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ, డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, టాటా కన్జూమర్, కోల్ ఇండియా, అపోలో హాస్పిటల్స్, రిలయన్స్, గ్రాసిమ్, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు తమ ప్రయాణాన్ని లాభాలతో ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఇన్ఫోసిస్, ఎల్‌టిఐఎమ్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫైనాన్స్, టీసీఎస్, హీరో మోటార్స్, ఎల్ టి, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా మోటార్స్, ఎయిర్ టెల్, ఎస్బీఐ కంపెనీల షేర్లు నష్టాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నేడు నిలిచాయి.


Click it and Unblock the Notifications