For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇల్లు కొనే ముందు ఇవి చాలా ముఖ్యం

By Jai
|

సొంతిల్లు కలిగి ఉండాలని ప్రతి ఒక్కరు కలగంటుంటారు. అందుకోసం నిరంతరం శ్రమిస్తుంటారు. ఇల్లు కొనుగోలు చేయడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోను ముఖ్యమైన నిర్ణయంగా చెప్పవచ్చు. అయితే ఇందుకు తగిన ప్రణాళిక రూపొందించుకోవడమే కాకుండా దాన్ని తప్పకుండా అమలు చేయాలి. మీరు ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఏయే అంశాలపై దృష్టి సారించాలంటే..

చిన్న పాటి పరిశోధన

చిన్న పాటి పరిశోధన

మీకు ఇల్లు కొనుగోలు చేయడానికి ముందే ప్రస్తుతం మీరు ఉన్ననగరంలో గృహాల మార్కెట్ ఎలా ఉందో తెలుసుకోవాలి. ఇందుకోసం మీకు తెలిసిన వారిద్వారా సమాచారం సేకరించాలి. పేపర్లు, టీవీల్లో వచ్చే వివరణలు విశ్లేషించుకోవాలి. ఆన్ లైన్ లో కొన్ని వెబ్ సైట్లు వివిధ ప్రాంతాల్లోని గృహ ప్రాజెక్టులతో పాటు వాటి ధరల వివరాలను తెలియజేస్తున్నాయి. వీటిలో మీ బడ్జెట్ కు అనుగుణంగా ఉన్న వాటిని ఎంచుకోండి. ధరల్లో మార్పులు ఏవిధంగా ఉన్నాయో చూసుకోండి. పెరగడానికి, తగ్గడానికి కారణమయ్యే అంశాలపై దృష్టి పెట్టండి. మీ బడ్జెట్లో వచ్చే ప్రాంతంలో ఉన్న వసతుల గురించి తెలుసుకోండి.

బడ్జెట్- ప్రణాళిక

బడ్జెట్- ప్రణాళిక

మీ బడ్జెట్లో ఇల్లు వస్తుందనుకుంటే అందుకు అవసరమైన నిధులు మీ వద్ద ఉన్నాయో లేదో చూసుకోవాలి. మీ చేతిలోని సొమ్ముతో పాటు ఎంత రుణం అవసరం ఉంటుంది. ఎంత ఈఎంఐ చెల్లించాల్సి వస్తుందో లెక్కవేసుకోవాలి. ఉదాహరణకు ఇంటి విలువలో 20 శాతం వరకు డౌన్ పేమెంట్ చేద్దామనుకుంటే అందుకు అవసరమైన సొమ్మును సమీకరించుకోవాలి. ఇందుకోసం మీరు పొదుపు చేసుకున్న మొత్తం లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, బంగారం ద్వారా సమకూర్చుకోవచ్చు. మీ రుణ ఈఎంఐ తోపాటు మీ రిటైర్మెంట్ సేవింగ్స్, జీవిత బీమా పాలసీలు, పిల్ల విద్య తదితరాల కోసం ఎంత మొత్తం అవసరం ఉంటుందో చూసుకోండి. ఈ స్థాయిలో మీకు ఆదాయం వస్తుందా ఆలోచించండి. అత్యవసరమైన సందర్భాల్లో కూడా మీ దగ్గర కొంత సొమ్ము ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి.

వడ్డీ రేటు

వడ్డీ రేటు

మీరు రుణం తీసుకొని ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటే ఏదో ఒక గృహ ఫైనాన్స్ కంపనీని ఎంచుకోకండి. కొంత సమయం తీసుకొని మీకు అందుబాటులో ఉన్న హోమ్ ఫైనాన్స్ కంపనీలు లేదా బ్యాంకులు వసూలు చేస్తున్న వడ్డీ రేట్ల గురించి వివరంగా తెలుసుకోండి. స్థిర, చర వడ్డీ రేటుతో పాటు రుణ మంజూరుకు తీసుకునే ప్రాసెసింగ్ ఫీజు, ముందుగా రుణాన్ని చెల్లిస్తే వసూలు చేసే చార్జీలు, కన్వర్షన్ ఫీజు లాంటి వివరాలు తెలుసుకోండి. టాప్ అప్ రుణ సదుపాయం, సర్వీసుల వివరాలు తెలుసుకోవడం ముఖ్యం. రుణంపై ఈఎంఐ ఏళ్ల తరబడి చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి మంచి రుణ సంస్థను ఎంచుకోవాలి.

ఈఎంఐ

ఈఎంఐ

నెలవారీగా చెల్లించే ఈఎంఐ మొత్తాన్ని పెంచుకోవాలా లేక రుణ కాలపరిమితిని పెంచుకోవాలా అన్న దాని విషయంలో చాలా మందికి స్పష్టత ఉండదు. అయితే ద్రవ్యోల్భణం, వడ్డీ రేట్లను దృష్టిలో ఉంచుకొని రుణ కాల పరిమితిని ఎక్కువగా ఉంచుకోవడమే మంచిది. దీనివల్ల మీరు చెల్లించాల్సిన ఈఎంఐ భారం తగ్గుతుంది. ఈఎంఐని పెంచుకోవడం కన్నా రుణ చెల్లింపు కాలపరిమితిని పెంచుకోమనే చాలా ఆర్థిక సంస్థలు సూచిస్తుంటాయి. రుణ కాలపరిమితి మీ రిటైర్మెంట్ వయసు దాటి వెళ్లకుండా చూసుకోవాలి. ఎందుకంటే రిటైర్మెంట్ తర్వాత ఈఎంఐ లను చెల్లించడం ఇబ్బంది కరంగా ఉంటుంది. అప్పుడు ఆరోగ్యం తదితరాల కోసమే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది.

ప్రభుత్వ మద్దతు

ప్రభుత్వ మద్దతు

ప్రతి ఒక్కరికి ఇల్లును కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. ఈ నేపథ్యంలోనే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని తెచ్చారు. దీని ద్వారా గృహ రుణంపై వడ్డీ రాయితీని పొందవచ్చు. కాబట్టి దీని గురించి మీ బ్యాంకును అడిగి వివరాలు తెలుసుకోండి.

ఆఫర్లు, డిస్కౌంట్లు

రుణాలిచ్చే ఆర్థిక సంస్థలు పండగలు, లోన్ మేళాలు, ప్రాపర్టీ షోల సందర్బంగా ప్రత్యేకమైన ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తుంటాయి. రుణాలపై ప్రాసెసింగ్ ఫీజులను ఎత్తివేస్తుంటాయి. ఇలాంటి వాటిని వినియోగించుకుంటే మీకు ప్రయోజనం ఉంటుంది.

English summary

ఇల్లు కొనే ముందు ఇవి చాలా ముఖ్యం | Some important tips while Buying a House

Are you thinking of buying your dream house? If yes, then you must be having a lot of questions and you must be looking some guidance.
Story first published: Tuesday, June 18, 2019, 17:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X