For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదిరిపోయే ఆఫర్: ఇల్లు కొనాలనుకుంటున్నారా, ఇది భలే ఛాన్స్.. ఎందుకంటే?

|

ఇంటిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది మంచి సమయమేనా? అంటే కరోనా కారణంగా ప్రస్తుతం ధరలు పడిపోవడం, బ్యాంకుల్లో వడ్డీ రేట్లు తగ్గడం వంటి ఎన్నో కారణాల నేపథ్యంలో ఇంటిని కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయమని చెబుతున్నారు.

ఆర్థిక అనిశ్చితులు, శాలరీ కోత, ఉద్యోగాల కోత వంటి వివిధ కారణాల వల్ల చాలామంది తమ ఇంటి కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేశారు. దీంతో ఇతర రంగాల మాదిరి రియల్ ఎస్టేట్ రంగం కూడా మందకోడిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఉచిత పార్కింగ్ స్థలం, సులభమైన వాయిదా చెల్లింపులు, డిస్కౌంట్ వంటివి కూడా ఆఫర్ చేస్తున్నారు.

వేగంగా కోలుకుంటున్న చైనా, అమెరికా సహా ఇతర దేశాలకు రికార్డ్ ఎగుమతులువేగంగా కోలుకుంటున్న చైనా, అమెరికా సహా ఇతర దేశాలకు రికార్డ్ ఎగుమతులు

తగ్గిన ధరలు, వడ్డీరేట్ల కోత, డిస్కౌంట్

తగ్గిన ధరలు, వడ్డీరేట్ల కోత, డిస్కౌంట్

ప్రతి సంవత్సరం పండుగ సీజన్‌లో అమ్మకాలు పెరుగుతుంటాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే కరోనా అన్ని రంగాలను దెబ్బకొట్టింది. దీంతో రియల్ ధరలు పడిపోవడం, వడ్డీ రేట్లు తగ్గడానికి తోడు రియాల్టర్లు ఆఫర్లు ఇస్తుండటం గమనార్హం. మహారాష్ట్రలోని నారెడ్కోలో నమోదు చేసుకున్న డెవలపర్లు తమ కస్టమర్లకు స్టాంప్ డ్యూటీ ఛార్జీలను అందిస్తున్నారట. మహారాష్ట్రలో స్టాంప్ డ్యూటీని డిసెంబర్ 31వ తేదీ నరకు 5 శాతం నుండి 2 శాతానికి తగ్గించారు. ఈ చర్య రియాల్టీ రంగానికి ఊతమిస్తుందని భావిస్తున్నారు.

డిమాండ్ పుంజుకునే చర్యలు

డిమాండ్ పుంజుకునే చర్యలు

తక్కువ వడ్డీ రేట్లు, ప్రస్తుత ధరలు రియల్ ఎస్టేట్ రంగానికి కాస్త డిమాండ్ పెంచే అవకాశాలు లేకపోలేదు. రెడీ టూ హోమ్ యూనిట్స్ ధరలను కూడా తగ్గిస్తున్నారు. అమ్మకాలకు రియాల్టర్లు అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నారు. పండుగ సీజన్ సమీపించడంతో రియాల్టీ సంస్థలు భలే ఆఫర్లు ఇస్తున్నాయి. కాంప్లిమెంటరీ కార్ పార్కింగ్, సులభమైన పేమెంట్ ప్లాన్ ఇస్తున్నాయి. డెవలపర్లతో మాట్లాడి మరింత మంచి డీల్స్ కుదుర్చుకోవచ్చు. మొత్తానికి ప్రస్తుత చర్యలు డిమాండ్‌ను పునరుద్ధరించడంలో ఎంతోకొంత పని చేస్తాయని రియాల్టీ నిపుణులు అంటున్నారు.

మార్జిన్ సొమ్ము ఉంటే

మార్జిన్ సొమ్ము ఉంటే

ప్రస్తుతం ఇంటి కొనుగోలుకు పరిస్థితులు ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ఇంతకుముందుతో పోలిస్తే ఇంటి ధరలు దాదాపు 5 శాతం నుండి 10 శాతం వరకు తగ్గాయి. హోమ్ లోన్ పైన ఏడాది క్రితం వడ్డీ రేట్లు 8 శాతం నుంచి 9 శాతం ఉండగా ఇప్పుడు 7 శాతానికి దిగి వచ్చాయి. కావాల్సిన మార్జిన్ సొమ్ము ఉన్నట్లయితే ఇంటిని కొనుగోలు చేయడమే మంచిదని సూచిస్తున్నారు. ప్రస్తుతం ఇళ్ల ధరలు తక్కువగా ఉన్నాయని స్థిరాస్తి రంగ ప్రతినిధులు కూడా చెబుతున్నారు.

English summary

అదిరిపోయే ఆఫర్: ఇల్లు కొనాలనుకుంటున్నారా, ఇది భలే ఛాన్స్.. ఎందుకంటే? | This is best time to buy a house in 2020

For those who want to buy a house or land, this is a good time as interest rates are low and developers are offering discounts and freebies.
Story first published: Tuesday, September 8, 2020, 16:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X