For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అత్యాశకు పోవద్దు.. ఇళ్లను వచ్చిన ధరకే అమ్మేయండి, మీకు 2 లాభాలు: గడ్కరీ

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక సూచన చేశారు. ఇప్పటికే పెద్ద మొత్తంలో అమ్ముడుపోని ఇళ్లు ఉండిపోయిన విషయం తెలిసిందే. ఎలాంటి లాభం లేకుండా, అలాగే నష్టం లేకుండా రియాల్టర్లు ఇళ్లు అమ్మేందుకు మొగ్గు చూపాలని, అప్పుడు వడ్డీ రేట్లు భారం మీపై పడదని, అలాగే నగదు లభ్యత పెరుగుతుందని సూచించారు కేంద్రమంత్రి. కరోనా కారణంగా రియల్ ఎస్టేట్ కూడా పడకేసింది. దీంతో ఇళ్లు అమ్ముడుపోగా, వడ్డీలు కుప్పగా మారి రియాల్టర్లు ఇబ్బంది పడుతున్నారు.

భరించలేరేమో.. మీ ఇళ్లను డిస్కౌంట్‌కైనా అమ్మేయండి: హోమ్ బయ్యర్స్‌కు గుడ్‌న్యూస్భరించలేరేమో.. మీ ఇళ్లను డిస్కౌంట్‌కైనా అమ్మేయండి: హోమ్ బయ్యర్స్‌కు గుడ్‌న్యూస్

లాభం, నష్టం లేకుండా వచ్చిన ధరకే అమ్మేసుకోండి

లాభం, నష్టం లేకుండా వచ్చిన ధరకే అమ్మేసుకోండి

వడ్డీ భారం లేకుండా చూసుకునేందుకు, నగదు లభ్యత పెంచుకునేందుకు ఇళ్లను, ఫ్లాట్లను వచ్చిన రేటుకే అమ్మేయాలని నిర్మాణ రంగ సంస్థలకు గడ్కరీ సూచించారు. ఇప్పటిదాకా అమ్ముడుకాని ఫ్లాట్లను, గృహాల్ని డెవలపర్లు లాభనష్టాల్లేకుండా విక్రయించాలన్నారు. ప్రస్తుత కష్టకాలంలో లాభాల కోసం వేచి చూడవద్దని, పెట్టిన పెట్టుబడి వస్తే చాలనుకుంటే బాగుంటుందని హితవు పలికారు. నరెడ్కో బుధవారం ఏర్పాటు చేసిన వెబినార్‌లో గడ్కరీ మాట్లాడారు. ఇప్పటికే మందగమనంతో ఇబ్బందులు ఉంటే కరోనా మరింత సంక్షోభంలోకి నెట్టేసిందన్నారు.

రియల్ రంగంపై తీవ్ర ప్రభావం

రియల్ రంగంపై తీవ్ర ప్రభావం

కరోనా కారణంగా రియల్ రంగం కూడా తీవ్రంగా ప్రభావితమైందని, డిమాండ్ నెమ్మదించిందని గడ్కరీ చెప్పారు. రియాల్టర్లు తమ ప్రతినిధులను గృహ నిర్మాణ, ఆర్థిక శాఖ మంత్రులు, ప్రధాని కార్యాలయానికి పంపించి ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన సలహాలు ఇవ్వాలని సూచించారు. మీ సమస్యలుకూడా వివిరించాలన్నారు. ఈ సందర్భంగా డిమాండ్ పెంచేందుకు రియాల్టర్లు కొన్ని సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు వ్యాపారాలు విస్తరించడంతో పాటు రోడ్డు నిర్మాణం వంటి ప్రాజెక్టులు చేపట్టాలన్నారు.

సొంత ఫైనాన్స్ సంస్థలు స్థాపించుకోండి

సొంత ఫైనాన్స్ సంస్థలు స్థాపించుకోండి

డిమాండ్ పెంపొందించుకునేందుకు పెంపొందించడానికి రియాల్టర్లు ఆటో ఇండస్ట్రీల వలె సొంతంగా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలను ఏర్పాటు చేసుకోవాలని గడ్కరీ సూచించారు. దీంతో తక్కువ వడ్డీకే రుణాలు రావడంతో పాటు బ్యాంకుల మీద పూర్తిగా ఆధారపడటం తగ్గించుకోవచ్చునని చెప్పారు. ఈక్విటీ చొప్పించడం ద్వారా NBFCలను అటు ప్రభుత్వం, ఇటు ప్రయివేటు వ్యక్తులు బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

అత్యాశకు పోవద్దు.. అమ్మేయండి

అత్యాశకు పోవద్దు.. అమ్మేయండి

దీర్ఘకాలిక గృహ రుణాలను తక్కువ వడ్డీ రేటుకే అందిస్తే EMIలు తక్కువగా ఉండటంతో పాటు కస్టమర్లు ప్రయోజనం పొందుతారని తెలిపారు. ముంబై సహా చాలామంది రియాల్టర్లు ఇళ్లను అమ్ముకోకపోగా చ.అ.కు రూ.40,000 వరకు వస్తుందని ఎదురు చూస్తున్నారని, ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, ఇది మరీ అత్యాశకు పోవడమే అవుతుందన్నారు. లాభనష్టాలు లేకుండా అమ్మేసుకోవాలన్నారు. చిన్న పట్టణాల్లో రూ.10 లక్షల కంటే లోపు రేటుగల ఫ్లాట్లను డెవలపర్లు నిర్మించాలన్నారు.

English summary

అత్యాశకు పోవద్దు.. ఇళ్లను వచ్చిన ధరకే అమ్మేయండి, మీకు 2 లాభాలు: గడ్కరీ | Sell in unsold units at no profit no loss to save interest: Gadkari

Union Road Transport and Highways Minister Nitin Gadkari on Wednesday asked real estate developers to clear their inventory without looking for high profits to save interest costs.
Story first published: Thursday, April 30, 2020, 8:26 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X