2022 క్యాలెండర్ ఏడాది మొదటి అర్ధ సంవత్సరంలో హైదరాబాద్‌లో హౌసింగ్ సేల్స్ పెరిగాయి. దేశంలోని మేజర్ ఎనిమిది మార్కెట్‌లలో హైదరాబాద్, ఢిల్లీ-NCR, అహ్మదాబాద్ నగరాల్లో సేల్స్ పెరిగాయి. మిగతా ఐదు చోట్ల తగ్గాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్(MMR), పుణే, బెంగళూరు, కోల్‌కతా, చెన్నైనగరాల్లో హౌసింగ్ సేల్స్ డిమాండ్ తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో హౌసింగ్ సేల్స్ ఏకంగా 24 శాతం పెరిగాయి. ఏడాది ప్రాతిపదికన సేల్స్ ఇరవై నాలుగు శాతం పెరిగి 9,016 నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో ఢిల్లీ-NCRలో హౌసింగ్ సేల్స్ 7,297 యూనిట్లు నమోదయ్యాయి. ఈసారి మాత్రం పెరిగాయి.

అందుకే హౌసింగ్ సేల్స్ జంప్
2020తో పోలిస్తే 2021లో హౌసింగ్ సేల్స్ మంచి ఉత్సాహకరంగా ఉంటాయని రియాల్టీ మార్కెట్ రంగం అంచనా వేస్తోంది. 2020 పూర్తి సంవత్సరానికి ఢిల్లీ-NCRలో హౌసింగ్ సేల్స్ 17,789 యూనిట్లుగా నమోదయ్యాయి. ఢిల్లీ-NCRలో గురుగ్రామ్, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజీయాబాద్, ఫరీదాబాద్ కూడా ఉంటాయి. కరోనా సమయంలో హౌసింగ్ సేల్స్ పుంజుకున్నాయని, ఇందుకు ప్రధాన కారణంగా దాదాపు గత దశాబ్ద కాలంలో హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఈసారి తక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. కరోనా నేపథ్యంలో ఇంటిపై పెట్టుబడులు పెరిగి, హౌసింగ్ సేల్స్ పెరుగుతున్నాయని, దీనికి తోడు రిమోట్ వర్క్ కూడా కలిసి వచ్చిందని గుర్తు చేస్తున్నారు.

ఢిల్లీలో సేల్స్ పెరిగాయి
ప్రపంచ ఆరోగ్య సంక్షోభం హౌసింగ్ సేల్స్ పైన ప్రభావం చూపాయని రియాల్టీ రంగం నిపుణులు చెబుతున్నారు. హౌసింగ్ డాట్ కామ్, ప్రాప్టైగర్ డైరెక్టర్ రీసెర్చ్ అంకితా సూద్ మాట్లాడుతూ... ఏప్రిల్-జూన్ కాలంలో ఢిల్లీ-ఎన్సీఆర్‌లో హౌసింగ్ సేల్స్ 50 శాతం మేర పెరిగాయని చెప్పారు. గత ఏడాది లాక్ డౌన్ కారణంగా సేల్స్ తగ్గాయన్నారు. ఏప్రిల్-జూన్ కాలంలో సేల్స్ 2828 నమోదయ్యాయి. గత ఏడాది ఇదే కాలంలో 1886గా ఉంది.

రెండో త్రైమాసికంలో...
హైదరాబాద్, ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో సేల్స్ పెరగగా, మిగతా నగరాల్లో తగ్గాయి. దీంతో మొత్తం ఎనిమిది నగరాలను చూసుకుంటే రెండో త్రైమాసికంలో సేల్స్ 16 శాతం తగ్గాయి. సేల్స్ వాటాలో ముంబై 21 శాతంతో మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీ 18 శాతంతో రెండో స్థానంలో ఉంది.


Click it and Unblock the Notifications