టాటా హౌసింగ్ ఇంటి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. హోం బయ్యర్స్‌కు ఆనందం కలిగించేలా నేషనల్ ఫ్లాష్ సేల్‌ను ప్రకటించింది. ఫైనల్ రష్ సేల్ కింద దేశవ్యాప్తంగా 15 ప్రాజెక్టుల్లో, 150 యూనిట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి డిస్కౌంట్ పైన లభిస్తాయి. ఈ ఇళ్ల అమ్మకాలు మార్చి 12వ తేదీ నుండి ప్రారంభమవుతున్నాయి. అంటే రేపటి నుండి (శుక్రవారం) ప్రారంభమవుతున్నాయి. 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.

రూ.లక్షలు ఆదా చేయవచ్చు
ఈ ప్రాజెక్టులో రూ.20 లక్షల నుండి రూ.6 కోట్ల వరకు అందుబాటులో ఉన్నాయి. మూడు రోజుల పాటు అందుబాటులో ఉండే ఈ సేల్ ఎంతోమందికి ఆఫర్‌లో లభిస్తుంది. ఈ ఫ్లాష్ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసే వారు రూ.2 లక్షల నుండి రూ.21 లక్షల వరకు ఆదా చేయవచ్చు. ఈ సేల్‌లో కొనుగోలు ద్వారా లక్షల రూపాయలు సేవ్ చేయవచ్చునని టాటా హౌసింగ్ ఓ ప్రకటనలో తెలిపింది.

కొనుగోలుదారులకు ప్రయోజనం
ఇటీవల మహారాష్ట్ర, ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వాలు హౌసింగ్ సేల్స్ పెంచే చర్యల్లో భాగంగా స్టాండ్ డ్యూటీని మూడు శాతం మేర తగ్గించాయి. రూ.35 లక్షల నుండి రూ.45 లక్షల కేటగిరీ ఇళ్లపై ఈ తగ్గింపును ఇచ్చాయి. ఇది రియాల్టీకి ఊతమిచ్చే చర్య. కర్ణాటక ప్రభుత్వం రూ.21 లక్షల నుండి రూ.35 లక్షల ఇళ్లపై మే 2020న స్టాంప్ డ్యూటీన 5 శాతం నుండి 3 శాతానికి తగ్గించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీపై 1 శాతం కన్సెషన్ ఇచ్చింది. ఇప్పుడు టాటా హౌసింగ్ కూడా రియాల్టీకి ఊతమిచ్చేలా కస్టమర్లకు రూ.21 లక్షల వరకు ప్రయోజనం కల్పించే ప్రకటన చేసింది.

వరుసగా గుడ్ న్యూస్
ఇటీవల ఇంటి కొనుగోలుదారులకు వరుసగా ప్రయోజనకర ప్రకటనలు వస్తున్నాయి. ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI), ప్రయివేటురంగ దిగ్గజం HDFC, ICICI, కొటక్ మహీంద్రా తదితర బ్యాంకులు హోమ్ బయ్యర్స్‌కు వడ్డీ రేట్లను తగ్గించాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications