For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇల్లు కొనుగోలుకు ఇదే సమయం, ట్యాక్స్ బెనిఫిట్స్ ఎన్నో

|

న్యూఢిల్లీ: మీరు కొత్త ఇంటిని కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ బడ్జెట్‌లో మీరు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ గుడ్‌న్యూస్ చెప్పారు. వేతనజీవులతో పాటు చాలామంది వివిధ రంగాల్లో ఉన్నవారిలో ఎక్కువమంది హోంలోన్ ద్వారా సొంతింటి కలను సాకారం చేసుకుంటారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్మలమ్మ సోమవారం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. కరోనా నేపథ్యంలో ఈసారి బడ్జెట్‌పై వివిధ రంగాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. వాటికి అనుగుణంగా బడ్జెట్ ఉందని అంటున్నారు. అలాగే డిమాండ్‌ను ప్రోత్సహించే చర్యలు ఉన్నాయి. ఇందులో భాగంగా హోంలోన్ కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ చెప్పారు. వివిధ రాష్ట్రాలు కూడా డిమాండ్ పెంచే చర్యలు చేపట్టాయి.

వారికి నిర్మల వరం, ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ అవసరంలేదు: ఎన్నారైలకు గుడ్‌న్యూస్వారికి నిర్మల వరం, ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ అవసరంలేదు: ఎన్నారైలకు గుడ్‌న్యూస్

ఆఫర్లే ఆఫర్లు

ఆఫర్లే ఆఫర్లు

ఇప్పటికే కరోనా కారణంగా ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించింది. బ్యాంకులు అందుకు అనుగుణంగా హోంలోన్ రేట్లలో కస్టమర్లకు ఊరటనిచ్చాయి. మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాలు స్టాంప్ డ్యూటీని తగ్గించాయి. పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. తాజా బడ్జెట్‌లో కేంద్రం అఫర్డబుల్ హౌసింగ్ విభాగానికి ట్యాక్స్ హాలీడేస్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రూ.1.5 లక్షల అదనపు వడ్డీ రాయితీ ప్రయోజనాన్ని కూడా పొడిగించింది. 2022 మార్చి వరకు ఇది అందుబాటులో ఉంటుంది. లోన్ తీసుకొని కొత్త ఇంటిని కొనుగోలు చేస్తే రుణ వడ్డీ మొత్తంపై రూ.1.5 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనం ఉంది.

ఈఎంఐ భారం తగ్గుతుంది

ఈఎంఐ భారం తగ్గుతుంది

సాధారణంగా మీరు తీసుకునే మొత్తం రుణం, వడ్డీని కలిపి ఈఎంఐలుగా విభజిస్తారు. హోంలోనే వడ్డీ రేటు వంటి వివిధ అంశాలు తోడు కావడంతో ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రియాల్టీ రంగానికి ఊతమిస్తుందని, ఈ ఏడాది డిమాండ్ మరింత పెరుగుతుందని ఈ రంగంలోని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ధరలపై ప్రభావం

ధరలపై ప్రభావం

ఈ బడ్జెట్‌లో ఏసీలు, రిఫ్రిజిరేటర్లలో వినియోగించే కంప్రెషర్, ఎల్ఈడీ బల్బులు, ప్రింటెడ్ సర్క్యూడ్ బోర్డులు, ముడి సిల్క్, నూలు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. దిగుమతి సుంకం పెరగడం వల్ల వీటి ధరలు పెరుగుతున్నాయి. సోలార్ ఇన్వర్టర్లు, వాహనాల్లో వినియోగించే కొన్ని విడిభాగాలు, మొబైల్ ఫోన్ల కవర్లు, చార్జర్లు, కనెక్టర్లు వంటి ధరలు పెరగనున్నాయి. అదే సమయంలో ఇనుము, స్టీల్ తుక్కు ధరలు తగ్గనున్నాయి. బంగారం, వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి.

English summary

ఇల్లు కొనుగోలుకు ఇదే సమయం, ట్యాక్స్ బెనిఫిట్స్ ఎన్నో | This year is a good time to buy a house: Here are the tax benefits you get

For those who have been eyeing a home for years, 2021 may be a good year to jump in. Home loan rates are down, as are property prices. States such as Maharashtra and Karnataka have also slashed stamp duties. The bonus is that you get tax breaks
Story first published: Tuesday, February 2, 2021, 14:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X