గతంలో ఎప్పుడూ లేనివిధంగా సొంతింటి నిర్మాణానికి డిమాండ్ భారీగా పెరిగిందని HDFC బ్యాంకు చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు. ఇది తాత్కాలికంగా వచ్చిన డిమాండ్ కాదని, సంస్థాగతంగా వచ్చిన డిమాండ్ అన్నారు. ఇది ఇలాగే కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు వన్ వరల్డ్ వన్ రియాల్టీ గ్లోబల్ ప్రోప్ టెక్ సమ్మిట్ 2021లో మాట్లాడారు. 44 ఏళ్లుగా హౌసింగ్ సెక్టార్‌లో పని చేస్తోన్న తన ముందుకు ఇప్పటి వరకు ఇలాంటి డిమాండ్ రాలేదన్నారు. ఇటీవలి కాలంలో సొంతిళ్ల కోసం ప్రయత్నించే వారి సంఖ్య భారీగా పెరిగిందన్నారు.

ఇలాంటి డిమాండ్ పెరిగింది
సొంతింటికి డిమాండ్ పెరగడానికి పలు కారణాలు ఉన్నాయని దీపక్ పరేక్ అన్నారు. తక్కువ వడ్డీ రేట్లపై బ్యాంకులు ఇంటి రుణాలు ఇవ్వడంతో సొంతింటి కొనుగోళ్లకు డిమాండ్ పెరుగుతోందన్నారు. సానుకూలం లేదా సుస్థిరమైన ఆస్తుల ధరలు, ఇళ్ల రుణాలపై ద్రవ్య బెనిఫిట్స్ కొనసాగించడం కలిసి వచ్చినట్లు తెలిపారు. మొదటిసారి ఇళ్లు కొనుగోలు చేసేవారు, వర్క్ ఫ్రమ్ హోమ్ కింద సేవలు అందించేందుకు అవసరమైన పెద్ద ఇల్లు కొనుగోలు చేయాలని భావిస్తున్న వారి నుండి డిమాండ్ పెరిగిందన్నారు.

ఎకానమీపై ప్రభావం
కరోనా వల్ల క్షీణించిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి కోలుకుంటోన్న దశలో అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు ద్రవ్య లభ్యతకు పలు విధానాలు అమలు చేస్తున్నాయని, పలు దేశాల ప్రభుత్వాలు ప్రస్తుత రియాల్టీ రంగంలో పెట్టుబడులు పెంచడంపై దృష్టిని కేంద్రీకరించాయన్నారు. ద్రవ్యోల్బణం పెరగకుండా స్థిరమైన రికవరీని ఖరారు చేస్తూ భవన నిర్మాణం సాగించడం ఒక మార్గమని చెప్పారు. భవన నిర్మాణ రంగంలో మౌలిక వసతుల కల్పన వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఇది ఎకానమీపై ఎన్నో రెట్లుగా సానుకూల ప్రభావం చూపుతుందన్నారు.

సొంతింటి కోసం
ఫిన్ టెక్, హెల్త్ టెక్, ఎడ్యుటెక్, రెగ్ టెక్ గురించి చర్చ జరుగుతోందని, ప్రాపర్టీ టెక్నాలజీ లేదా ప్రాప్-టెక్ అంటే ఇంకా శైశవ దశలోనే ఉందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా నిర్మాణ రంగం డిజిటలైజ్ అయిందని, కానీ భారత్‌లో రియాల్టీ రంగం రెవెన్యూలో 1.5 శాతం మాత్రమే డిజిటలైజేషన్ కోసం కేటాయిస్తోందన్నారు. మహిళలు ఇది వరకు బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపేవారని, ఇప్పుడు సొంతింటి కోసం చూస్తున్నారన్నారు.


Click it and Unblock the Notifications