కరోనా కారణంగా అంతర్జాతీయంగా 56 కీలక దేశాలతో పోలిస్తే భారత్‌లో ఇళ్ల ధరలు తక్కువగా ఉన్నాయని ఇంటర్నేషనల్ రియాల్టీ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. 2020 డిసెంబర్ త్రైమాసికంలో దేశీయంగా ఇళ్ల ధరలు సగటున 3.6 శాతం క్షీణించాయని పేర్కొంది. 2019లో ఇదే సమయంలో అంతర్జాతీయంగా 43వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 56కు పడిపోయింది. ఈ మేరకు నైట్ ఫ్రాంక్ గ్లోబల్ హౌస్ ప్రైస్ ఇండెక్స్ వెల్లడించింది. ప్రపంచంలోని ముఖ్యమైన 56 దేశాలు, భూభాగాల్లోని ప్రధాన నివాసస్థలాల్లో ధరలను అధికారిక గణాంకాల ఆధారంగా పరిశీలిస్తుంది.

భారత్ 56
ఈ నివేదిక ప్రకారం కరోనా దెబ్బతో 2020 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో భారత్‌లో ఇళ్ల ధరలు 3.6 శాతం తగ్గాయి. దీంతో నైట్ ఫ్రాంక్ అంతర్జాతీయ ఇళ్ల ధరల సూచీలో భారత్ కనిష్ఠ (56వ) స్థానానికి చేరుకుంది. ప్రపంచంలో అత్యంత పేలవ పనితీరు కనబర్చిన రియల్టీ మార్కెట్‌గా భారత్ నిలిచిందని ఈ నివేదిక తెలిపింది. భారత్ 2019 అక్టోబర్-డిసెంబర్ కాలంలో 43వ స్థానంలో నిలిచింది. గత ఏడాది జనవరి-మార్చిలోను అదే స్థానంలో కొనసాగింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 54వ స్థానానికి పడిపోయింది. తదుపరి క్వార్టర్‌లోను అదే స్థానంలో ఉన్నప్పటికీ, డిసెంబర్ త్రైమాసికంలో పడిపోయింది.

టాప్‌లో టర్కీ
ప్రపంచంలో 56 కీలక రియాల్టీ మార్కెట్లలో 30.3% ధరల వృద్ధితో టర్కీ అగ్రస్థానంలో ఉంది. 18.6 శాతం వృద్ధితో రెండో స్థానంలో న్యూజిలాండ్, 16 శాతం ధరల పెరుగుదలతో స్లొవేకియా మూడో స్థానంలో ఉన్నాయి. కరోనాతో అధికంగా ప్రభావితమైన అమెరికాలోను ఇళ్ల ధరలు 10.4 శాతం మేర పెరిగాయి. 2020 డిసెంబర్ క్వార్టర్‌లో 89 శాతం దేశాలు, భూభాగాల్లో ధరలు పెరిగాయని ఈ రిపోర్ట్ తెలిపింది.

ఇక్కడ ఇళ్ల ధరలు తగ్గాయి
భారత్‌లో 3.6 శాతం మేర ఇళ్ల ధరలు తగ్గాయని ఈ నివేదిక తెలిపింది. మొరాకోలో 3.3 శాతం తగ్గాయి. రష్యాలో 14 శాతం, కెనడాలో 9 శాతం, బ్రిటన్‌లో 9 శాతం, జపాన్‌లో 5 శాతం, సింగపూర్‌లో 2.5 శాతం చొప్పున ఇళ్ల ధరలు పెరిగాయి. డిసెంబర్ త్రైమాసికంలో భారత్ 56వ స్థానానికి పడిపోగా, ఇదే చివరి ర్యాంక్. హాంగ్‌కాంగ్, మలేషియాల్లో ఇళ్ల ధరలు తగ్గాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications