For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Stock Market: ట్రేడర్లకు శుభవార్త.. జనవరి 27 నుంచి మారుతున్న రూల్.. ఇక ఒక్కరోజులోనే..

|

Stock Market: స్టాక్ మార్కెట్లో ట్రేడర్లకు అన్నింటికంటే ముఖ్యమైనది డబ్బు. అది ఎంత వేగంగా వేరి చేతికి వస్తే దానిని అంత వేగంగా మరోసారి ఇన్వెస్ట్ చేసేందుకు వినియోగించాలని వారు చూస్తుంటారు. అయితే ఈ క్రమంలో వారికి నిజంగా పెద్ద ఊరటను అందించే వార్త ఒకటి ఉంది.

మారిన నిబంధన..

మారిన నిబంధన..

స్టాక్ మార్కెట్లో ఇకపై ట్రేడర్లు చేసే క్రయవిక్రయాల చెల్లింపులు, సెటిల్ మెంట్ వేగంగా జరగనున్నాయి. వారి డీమ్యాట్ ఖాతాల్లోకి మునుపటి కంటే వేగంగా డబ్బు రానుంది. స్టాక్ మార్కెట్ లావాదేవీల (T+1 సెటిల్‌మెంట్) నిబంధన అమలులోకి రావటమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే ఈ రూల్స్ జనవరి 27, 2023 నుంచి అమలులోకి వస్తాయని రెగ్యులేటరీ వర్గాలు తెలిపాయి.
గతంలో విధానం..

గతంలో విధానం..

ప్రస్తుతం స్టాక్ మార్కెట్‌లో T+2 సెటిల్‌మెంట్ విధానంలో నడుస్తున్నాయి. ఈ విధానం కింద మార్కెట్లో ఎవరైన వ్యక్తి కొనటం లేదా అమ్మటం చేసినట్లయితే ఆ ట్రాన్సాక్షన్ సెటిల్ చేసేందుకు 48 గంటల సమయం పట్టేది. దీంతో ఇన్వెస్టర్ ఖాతాలోకి ఆ సొమ్ము చేరటానికి రెండు రోజుల సమయం పట్టేది. కానీ ఇకపై ఇంత వెయిటింగ్ అక్కర్లేదు. ఎందుకంటే ఈనెల 27 నుంచి లావాదేవీల కోసం T+1 సెటిల్‌మెంట్ విధానం అమలు కానుంది.

T+1 సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..?

T+1 సెటిల్‌మెంట్ అంటే ఏమిటి..?

T+1 సెటిల్‌మెంట్ జనవరి 27, 2023 నుంచి భారత స్టాక్ మార్కెట్‌లో అమలు చేయబడుతుంది. ఇది దేశంలోని ప్రతి చిన్న, పెద్ద పెట్టుబడిదారుని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల స్టాక్ మార్కెట్ లో లావాదేవీలు గతంలో కంటే చాలా వేగంగా జరుగుతాయి. షేర్లు విక్రయించినప్పుడు దాని డబ్బు కేవలం 24 గంటల్లో చేతికి అందుతుంది. గతంలో మాదిరిగా సెటిల్ మెంట్ కోసం 48 గంటల పాటు వేచిచూడాల్సిన అవసరం లేదు. T+1 సెటిల్‌మెంట్ స్కీమ్ కింద పెట్టుబడిదారుడి తరపున షేర్లను కొనుగోలు చేసినా లేదా విక్రయించినా.. 24 గంటల్లో ఆ మొత్తం సంబంధిత ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఇది అన్ని స్టాక్‌లకు వర్తిస్తుంది.

 ప్రభావం ఏమిటి..?

ప్రభావం ఏమిటి..?

ఫిబ్రవరి 25, 2022న మొదటిసారిగా T+1 సెటిల్‌మెంట్ స్కీమ్ స్టాక్ మార్కెట్లో.. మార్కెట్ విలువ ప్రకారం 100 అతి చిన్న స్టాక్‌లకు అమలు చేయబడింది. ఆ తర్వాత మార్చి 2022 నుంచి నెలవారీ ప్రాతిపదికన దశలవారీగా T+2 నుంచి T+1కి షేర్ల సెటిల్‌మెంట్ మార్చబడింది. T+1 సెటిల్‌మెంట్ పథకం అమలులోకి వచ్చిన తర్వాత.. ప్రజలు మునుపటి కంటే వేగంగా చెల్లించబడతారు. దీంతో మార్కెట్‌లో లిక్విడిటీ పెరగడంతో పాటు మార్జిన్ అవసరం కూడా తగ్గుతుందని స్టాక్ మార్కెట్ల నిపుణులు చెబుతున్నారు. ఇది ట్రేడర్లకు, ఇన్వెస్టర్లకు నిజంగా కలిసొచ్చే అంశం అని చెప్పుకోవాలి.

English summary

Stock Market: ట్రేడర్లకు శుభవార్త.. జనవరి 27 నుంచి మారుతున్న రూల్.. ఇక ఒక్కరోజులోనే.. | Indian Stock markets Moving to T+1 settlment system from 27 january 2023

Indian Stock markets Moving to T+1 settlment system from 27 january 2023
Story first published: Sunday, January 22, 2023, 10:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X