For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ వారం బంగారం ధర పెరుగుతుందా.. తగ్గుతుందా, ఎందుకు?

|

కరోనా కారణంగా దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఈ మహమ్మారి బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో మార్కెట్లతో పాటు సురక్షిత పెట్టుబడిగా భావించే అతి ఖరీదైన బంగారం వంటి లోహాలపై కూడా పడుతోంది. దీంతో గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గడం లేదా స్వల్పంగా పెరగడం జరుగుతోంది. మొత్తానికి అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లో బంగారం ధర పడిపోయింది.

మళ్లీ షాక్, భారీగా పెరిగిన బంగారం ధరలు.. రికార్డ్ ధరతో ఎంత తక్కువంటే?మళ్లీ షాక్, భారీగా పెరిగిన బంగారం ధరలు.. రికార్డ్ ధరతో ఎంత తక్కువంటే?

బంగారం విక్రయిస్తున్న ఇన్వెస్టర్లు

బంగారం విక్రయిస్తున్న ఇన్వెస్టర్లు

కరోనా వైరస్ ఇన్వెస్టర్లు బంగారాన్ని విక్రయించి సొమ్ము రూపంలో దాచి పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా క్యాష్ కోసం బంగారాన్ని విక్రయిస్తున్నారని చెప్పారు.

బంగారం విక్రయించి..

బంగారం విక్రయించి..

సెంట్రల్ బ్యాంకులు డాలర్లు కొనుగోలు చేసేందుకు బంగారాన్ని విక్రయించే అవకాశాలు ఉన్నాయని కూడా కొంతమంది భావిస్తున్నారని చెబుతున్నారు. డాలరు మారకం విలువతో బంగారం రికార్డ్ గరిష్టానికి చేరుకుంది.

ఈ వారం ఇలా ఉండొచ్చు

ఈ వారం ఇలా ఉండొచ్చు

ప్రపంచ మార్కెట్లోని అస్థిరత కారణంగా ఈ వారం బంగారం, వెండి ధరలు అస్థిరంగానే ఉండవచ్చునని బులియన్ మార్కెట్ నిపుణుులు అంచనా వేస్తున్నారు. ఎంసీఎక్స్‌‌లో బంగారం 38,400 స్థాయికి రావొచ్చునని, 40,440కి వస్తే రూ.40,920-41,500కు చేరుకోవచ్చునని అంటున్నారు.

వెండి ధర

వెండి ధర

వెండి ధర ఈ వారం కిలో రూ.33,500 వద్ద స్థిరంగా ఉండవచ్చునని, రూ.36,500 పైకి చేరుకుంటే రూ.37,700-38,500 ర్యాలీ కావొచ్చునని చెబుతున్నారు. కరోనా వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతుండటం బంగారం, వెండి నష్టపోవడానికి కారణమవుతోందని చెబుతున్నారు.

ఇలా షార్ట్ సేల్ చేయవచ్చు

ఇలా షార్ట్ సేల్ చేయవచ్చు

బంగారం ఏప్రిల్ కాంట్రాక్ట్ ఈ వారం రూ.41,571 వద్ద చలించకుంటే కొంత దిద్దుబాటుకు గురయ్యే అవకాశముందని చెబుతున్నారు. రూ.41,571 వద్ద స్టాప్ లాస్‌గా పెట్టుకొని, రూ.40,877 నుండి రూ.41,466 వద్ద కాంట్రాక్టును షార్ట్ సేల్ చేయవచ్చునని అంటున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో..

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1500 డాలర్ల పైకి చేరుకోవచ్చునని, 1520 నుండి 1540 డాలర్ల మధ్య నిలకడగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. 1460 డాలర్లకు దిగువకు వచ్చినా రావొచ్చునని చెబుతున్నారు.

English summary

ఈ వారం బంగారం ధర పెరుగుతుందా.. తగ్గుతుందా, ఎందుకు? | Gold Prices fall as investors stockpile cash amid coronavirus lockdowns

Gold prices fell on Monday as investors stockpiled cash, with a rising numbers of coronavirus-led national lockdowns threatening to overshadow stimulus measures from global central banks to combat the economic damage.
Story first published: Monday, March 23, 2020, 21:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X