బంగారం ధరలు శుక్రవారం పెరిగాయి. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు మధ్యలో స్వల్పంగా పెరిగాయి. ఈ రోజు (మార్చి 20) ధర పెరిగినప్పటికీ ఇటీవలి రికార్డ్ హై ధరతో పోల్చితే రూ.5,000 తక్కువగానే ఉంది. ఉదయం ఎంసీఎక్స్‌లో గోల్డ్ ప్యూచర్స్ 10 గ్రాములకు 0.4 శాతం పెరిగి రూ.39,996గా ఉంది. కొద్ది రోజుల క్రితం బంగారం రూ.45,000 మార్క్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. వెండి ఫ్యూచర్స్ 2 శాతం పెరిగి రూ.35,870గా ఉంది.

అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో...
అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరగడంతో ఈ ప్రభావం భారత మార్కెట్లపై పడింది. దీంతో శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం 41,705 పలికింది. ముందు రోజు.. అంటే గురువారం ఈ ధర రూ.40,310 వద్ద క్లోజ్ అయింది. వెండి ధర రూ.2,889 పెరిగి రూ.38,100 వద్ద ఉంది. అంతకుముందు దీని ధర రూ.35,211గా ఉంది.

భారీగా పెరిగిన ధర...
అంతర్జాీయ మార్కెట్లో బంగారానికి డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగాయని, ఈ ప్రభావం భారత మార్కెట్లపై పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. దీంతో 24 క్యారెట్ల స్పాట్ గోల్డ్ ధర ఢిల్లీలో రూ.1,395 పెరిగింది.

1,500 దాటిన బంగారం
నిన్నటి వరకు ఔన్స్ బంగారం 1450 సమీపంలో ఉన్న ధర అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు 1,514కు చేరుకుంది. కొద్ది రోజుల క్రితం ఔన్స్ బంగారం 1700 డాలర్లు దాటింది. ఆ తర్వాత 1450కి చేరుకొని, ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications