For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలేజీ లో చేరేటప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇస్తున్నారా?తస్మాత్ జాగ్రత్త?

ప్రస్తుతం చదువుల పేరిట అనేక ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొచ్చాయి.ర్యాంకుల పేరు చెప్పి తల్లిదండ్రుల వద్ద వేలకు వేళ్ళు డబ్బు ముక్కుపిండి మరి వాసులు చేస్తున్నాయి.

By bharath
|

ప్రస్తుతం చదువుల పేరిట అనేక ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొచ్చాయి.ర్యాంకుల పేరు చెప్పి తల్లిదండ్రుల వద్ద వేలకు వేళ్ళు డబ్బు ముక్కుపిండి మరి వాసులు చేస్తున్నాయి.ఈ ప్రైవేట్ సంస్థలు వచ్చాక ప్రభుత్వ పాఠశాలలకు అలాగే కళాశాలలకు ఆదరణ అమాంతంగా తగ్గింది.

ప్రైవేటు పాఠశాలలు:

ప్రైవేటు పాఠశాలలు:

ప్రస్తుతం ఒక పిల్లవాడిని ప్రైవేటు పాఠశాలలో చదివించాలంటే తల్లిదండ్రులకు చుక్కలు కనిపిస్తున్నాయి.ఫీజు మోత ఒక ఎత్తయితే దానికి తోడు పుస్తకాల కోసం అలాగే స్కూల్ యూనిఫామ్ వంటి ఖర్చులన్నీ కలిపి తడిచి మోపెడవుతున్నాయి.

ప్రైవేటు కళాశాలలు:

ప్రైవేటు కళాశాలలు:

పాఠశాల తరువాత చాల మంది పై చదువులకు ప్రైవేట్ కళాశాలలో చేరుతున్నారు.వారు కళాశాలలో చేరే ముందు తమ వద్ద ఉన్న ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది.అయితే మధ్యలో వారికి కళాశాల నచ్చకో లేక ఉచిత సీటు దొరికినపుడు సర్టిఫికెట్లు అడిగితే కళాశాల యాజమాన్యం మొత్తం డబ్బు చెల్లిస్తే గాని సర్టిఫికెట్లు ఇవ్వమని షరతులు విధిస్తున్నారు.

పిల్లల భవిష్యతు:

పిల్లల భవిష్యతు:

కళాశాలలు ఉండేది పిల్లలకు మంచి చదువు చెప్పి వారి భవిష్యతు తీర్చి దిద్దటానికి కానీ దేశం లో చాల కళాశాలలు పిల్లల భవిష్యత్తుతో చెలగాటం ఆడుకుంటున్నాయి.వీటి ద్వారా చాలామంది ఉజ్వల భవిష్యత్తు కోల్పోతున్నారనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

సుప్రీమ్ కోర్ట్:

సుప్రీమ్ కోర్ట్:

ప్రస్తుత రోజుల్లో విద్య అనేది ఒక వ్యాపార రంగం లా మారిపోయింది.ప్రతి ప్రైవేటు కళాశాల తమదైన శైలిలో దోపిడీలు చేయడం మొదలుపెట్టాయి.వీటన్నిటికీ అడ్డు కట్ట వేస్తూ సుప్రీమ్ కోర్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయం దేశం అంతటా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.

మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు:

మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు:

ఇకనుండి మీరు కళాశాలలో చేరేటప్పుడు ఒరిజినల్ సర్టిఫికెట్లు యాజమాన్యానికి ఇవ్వాల్సిన పనిలేదు వాటి బదులు కేవలం జిరాక్స్ కాపీలు ఇస్తే చాలు అని సుప్రీమ్ కోర్ట్ వెల్లడించింది.విద్యార్ధి తనుకు ఇష్టమున్న చోట చదువుకోవచ్చని కళాశాలలు బలవంత పెడితే కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పింది.

Read more about: supreme court colleges
English summary

కాలేజీ లో చేరేటప్పుడు మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇస్తున్నారా?తస్మాత్ జాగ్రత్త? | Supreme Court Says To Universities Dont Take Original Certificates From Students

Education has become a business sector in the present day. Every private college has started exploiting their own style.
Story first published: Friday, October 12, 2018, 13:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X