Income Tax: పన్ను చెల్లింపుదారులకు ఊరట.. ఇబ్బంది పెట్టే అధికారులకు సుప్రీం ఝలక్..
Income Tax: ఆదాయపు పన్ను అధికారులు సాధారణంగా పన్ను ఎగవేతలను అడ్డుకునేందుకు వారికి ఉన్న కొన్ని సమాచారాలతో రైడ్ చేస్తుంటారు. దీనిలో టాక్స్ పేయర్ కు చెందిన ప్రాంతాలను రైడ్ చేసినప్పుడు ఏవైనా టాక్స్ చెల్లించని ఆదాయాలను గుర్తిస్తే జరిమానా విధిస్తుంటారు అధికారులు.
అయితే కొన్ని సార్లు అధికారుల అత్యుత్సాహం, దూకుడు చర్యలు వల్ల కొంత మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అధికారులు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 153A కింద సోదాలు నిర్వహించినప్పుడు నిర్థిష్టమైన సాక్ష్యాలు లభ్యం కానప్పుడు వ్యక్తులు చెల్లించాల్సిన పన్ను మెుత్తాన్ని పెంచటం కుదరదని సుప్రీం కోర్టు తాజాగా వెల్లడించింది.

ఒక వేళ పన్ను అధికారులు తర్వాత సాక్ష్యాలను గుర్తించినట్లయితే కేసును తిరిగి తెరవవచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఒక విధంగా ఇది పన్ను చెల్లింపుదారులకు గొప్ప ఊరటని చెప్పుకోవచ్చు. అధికారుల నుంచి అనవసరమైన వేధింపులు వంటివి దీనివల్ల తగ్గుతాయని చాలా మంది భావిస్తున్నారు. అలాగే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్- 153A ప్రకారం.. అసెస్మెంట్ పూర్తయిన కేసులను ఆదాయ పన్ను విభాగం తిరిగి తెరవడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
రైడ్ చేసినప్పుడు ఏవైనా ఖచ్చితమైన, బలమైన సాక్ష్యూలు లభిచినప్పుడు మాత్రమే రీ-అసెస్మెంట్ కోసం పన్ను చెల్లింపుదారునికి ఆదేశాలు ఇవ్వవచ్చని కోర్టు వెల్లడించింది. ఇదే సమయంలో అత్యున్నత ధర్మాసనం గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని 147, 148 సెక్షన్ల ప్రకారం పన్ను ఎగవేసినట్లు గుర్తిస్తే కేసులను తిరిగి తెరవవచ్చు. మెుత్తానికి కోర్టు తాజా తీర్పు దేశంలోని పన్ను చెల్లింపుదారులకు చాలా పెద్ద ఊరటని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications