Patanjali Ayurvedic: యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి ఇటీవల వార్తల్లో నిలిచింది. తప్పుడు ప్రకటనలతో ప్రజలను పక్కదోవ పట్టిస్తోందని అభియోగం నమోదైంది. దీంతో సుప్రీంకోర్టు కూడా అక్షింతలు వేసింది. ఈ తరహా చర్యలు మానుకోవాలని సూచించింది. దీంతో సరేనని కోర్టు ముందు తలూపింది.
పతంజలి ఆయుర్వేదం మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ ఉత్పత్తుల ప్రకటనలు మరియు వాటి ఔషధ గుణాలకు సంబంధించి కోర్టులో ఇచ్చిన హామీని ప్రాథమికంగా ఉల్లంఘించారని అందులో పేర్కొంది. వారిపై ధిక్కార చర్యలు ఎందుకు ప్రారంభించకూడదో చెప్పాలని న్యాయస్థానం ప్రశ్నించింది.

అయితే సుప్రీంకోర్టు పరిశీలన కారణంగా పతంజలి ఫుడ్స్ లిమిటెడ్(PFL) వ్యాపార కార్యకలాపాలు, ఆర్థిక పనితీరు ఏమాత్రం ప్రభావితం కాదని పతంజలి గ్రూపు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఎడిబుల్ ఆయిల్, ఆహారం మరియు FMCG ఉత్పత్తులు PFL కింద లిస్ట్ కాబడిన స్వతంత్ర ఎంటిటీ అని పేర్కొంది.
పతంజలి ఫుడ్స్‌లో పతంజలి గ్రూప్‌కు దాదాపు 74 శాతం వాటా ఉంది. ఈ ప్రమోటర్ వాటాలో 32.37 శాతం షేర్ పతంజలి ఆయుర్వేద్ సొంతం. పతంజలి ఆయుర్వేదం ద్వారా వివిధ వ్యాధులకు చికిత్స చేస్తామని ప్రకటనలు చేయడంపై సుప్రీంకోర్డు మండిపడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆ బ్రాండ్ ఉత్పత్తులను నిలుపుదల చేసింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications