Higher Tax: సంచలనంగా మారిన సుప్రీం కోర్టు నిర్ణయం.. ఆందోళనలో దిగ్గజ కంపెనీలు..!
Higher Tax: 140 కోట్లకు పైగా జనాభా కలిగిన భారతదేశంలో అనేక ఇతర దేశాలకు చెందిన బహుళజాతి సంస్థలు తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నాయి. ఇందులో చాలా కంపెనీలు స్నేహపూర్వక దేశాలకు చెందినవే.
అయితే ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టంపై అక్టోబర్ 19న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలో వ్యాపారాలు చేస్తున్న అనేక బహుళజాతి(MNC) కంపెనీలకు ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే ఈ తీర్పు వల్ల వారు అధిక పన్నులు చెల్లించాల్సి రావొచ్చు. అలాగే అదనపు పన్ను చెల్లించడంతోపాటు గతంలోని కేసులను కూడా తిరిగి తెరవడానికి దారితీయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

పన్ను ఒప్పందాల ప్రకారం "అత్యంత అనుకూలమైన దేశం" నిబంధన ఆదాయపు పన్ను చట్టం కింద నోటిఫై చేయబడే వరకు స్వయంచాలకంగా ట్రిగ్గర్ కాదంటూ సుప్రీం ధర్మాసనం సంచలన తీర్పును వెలువరిచంచింది. దీని కారణంగా ప్రభుత్వానికి మిలియన్ డాలర్ల అదనపు పన్ను రాబడులు వచ్చే అవకాశం ఉంది. తీర్పుకు అనుగుణంగా పన్ను అధికారుల తాజాగా చర్యలు చేపట్టి పెండింగ్‌లో ఉన్న అంశాలను కూడా పునరుద్ధరించే అవకాశం ఉందని AKM గ్లోబల్ టాక్స్ పార్టనర్ అమిత్ మహేశ్వరి పేర్కొన్నారు.
ద్వంద్వ పన్నుల ఎగవేత ఒప్పందాల (DTAA) వర్తించే తేదీని, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (MFN) నిబంధనకు దాని సంబంధాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో కోర్టులో పెండింగ్ లో ఉన్న 11 పిటిషన్లు పరిష్కరించబడ్డాయి. ఏప్రిల్ 2021లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టి సుప్రీం కోర్టు డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్‌లో సభ్యులుగా ఉన్న దేశాలతో వివిధ భారతీయ ఒప్పందాల్లో ఉన్న MFN క్లాజ్ వివరణతో కూడిన ఢిల్లీ హైకోర్టు నిర్ణయాల నుంచి అప్పీళ్లు తలెత్తాయి. ద్వైపాక్షిక ఒప్పందాలు నెదర్లాండ్స్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ మధ్య ఉన్నాయి. మెుత్తానికి దీంతో ఆదాయపుపన్ను అధికారులు పాత కేసులను తిరిగి తోడే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications