Adani News: హిండెన్‌బర్గ్ ఆరోపణలపై ఫైనల్ రిపోర్ట్.. సుప్రీం కోర్టుకు సెబీ నివేదిక..!!
Adani News: ఈ ఏడాది జనవరి బిలియనీర్ గౌతమ్ అదానీ కెరీర్ లో అత్యంత కష్టకాలంగా చెప్పుకోవచ్చు. యూఎస్ షార్ట్ సెల్లర్ చేసిన ఆరోపణలతో ఏళ్లుగా కట్టుకున్న వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలటం అదానీని తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు కమిటీ ఏర్పాటు సంగతి తెలిసిందే.
దీంతో అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై చేసిన ఆరోపణలపై తన తుది నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) సిద్ధంగా ఉంది. కనీస పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనలను ఉపయోగించుకోవడం ద్వారా అదానీ గ్రూప్ తన గ్రూప్ కంపెనీల షేర్ల ధరలను తారుమారు చేసిందా? సంబంధిత-పార్టీ లావాదేవీలను బహిర్గతం చేయడంలో విఫలమైందా? అనే విషయాలపై విచారణ దృష్టి సారించింది. అయితే రిపోర్టులోని విషయాలు బయటకు వస్తేనే అసలు దర్యాప్తు ఎలా జరిగిందనే విషయం తెలుస్తుందని రాజకీయ పార్టీలు, ఇన్వెస్టర్లు వేచిచూస్తున్నారు.

సెబీ దర్యాప్తు వల్ల అదానీ గ్రూప్ కంపెనీలపై భారీగా ప్రతికూల ఫలితాలు ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది. గ్లోబల్ ఆడిట్ సంస్థ డెలాయిట్ తాజాగా అదానీ పోర్ట్స్ & సెజ్‌తో తన ఆరేళ్ల అనుబంధాన్ని ముగించింది. కొన్ని కంపెనీల డీలింగ్‌లు సంబంధిత-పార్టీ లావాదేవీల పరిధిలోకి వస్తాయో లేదో అనే ఆందోళనలు వ్యక్తం చేసింది. అదానీ పోర్ట్స్ స్వతంత్ర బాహ్య పరీక్షకు నిరాకరించిన తర్వాత కంపెనీ ఆర్థిక 2023 ఫలితాలపై ఆడిటర్ క్వాలిఫైడ్ ఒపీనియన్ జారీ చేసింది.
అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ నివేదికను అనుసరించి మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో బిలియన్ల డాలర్ల నష్టాన్ని ఎదుర్కొన్నప్పటికీ.. రికవరీతో సుమారు 47 బిలియన్ డాలర్లను తిరిగి పొందగలిగింది. సిమెంట్ వ్యాపారంలో ముందుకు సాగేందుకు సంఝీ కొనుగోలుతో గ్రూప్ తన ప్రధాన వ్యాపార ప్రయోజనాలపై దృష్టి సారిస్తోంది. అయితే విల్మార్ ఇంటర్నేషనల్ లో వాటాలను విక్రయిచ్చే అవకాశం ఉన్నట్లు వచ్చిన వార్తలను ఖండిస్తూ అలాంటి ఆలోచనలో అదానీ గ్రూప్ లేదని ఇటీవల వెల్లడించింది.


Click it and Unblock the Notifications