Adani: అదానీ గ్రూపు సంస్థల్లో ఏర్పడిన సంక్షోభం ఒకానొక సమయంలో మొత్తం ఇండియన్ స్టాక్ మార్కెట్ నే తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇందుకు కారణం హిండెన్ బర్గ్ అనే అమెరికాకు చెందిన పరిశోధనా సంస్థ. అయితే ఇప్పటివరకు పెట్టుబడిదారులు పూర్తిగా సంస్థను విశ్వసించలేదేమో గానీ తాజాగా ఆ గ్రూపు షేర్ల పరుగులు చూస్తే, ఎందుకు ఈ విధంగా ర్యాలీ అయ్యాయి అని ఆశ్చర్యం కలగక మానదు.
US షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ రీసెర్చ్ ఆరోపించిన విధంగా స్టాక్-ధరల తారుమారు జరిగినట్లు ఎటువంటి సాక్ష్యాలు లేవని కోర్టు ప్యానెల్ కు సెబీ నివేదిక సమర్పించింది. అందువల్ల అదానీ గ్రూప్ షేర్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి. మొత్తం గ్రూపులోని 10 లిస్టెడ్ కంపెనీలు తమ మార్కెట్ విలువకు సుమారు 10 బిలియన్ డాలర్లు జోడించాయి. సంస్థపై ఆరోపణలు వచ్చిన తర్వాత ఇదే అతిపెద్ద పెరుగుదలగా నిలిచింది.

అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, అదానీ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్, అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్, అదానీ పవర్ లిమిటెడ్ లు 5 శాతం అప్పర్ సర్క్యూట్ కు చేరాయి. అదానీ విల్మార్ లిమిటెడ్ 10 శాతం, అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ 6 శాతానికి పైగా ఎగబాకాయి. ఇక అదానీ ఎంటర్ టైన్ మెంట్ అయితే ఏకంగా 20 శాతానికి దగ్గరగా దూసుకుపోయింది.
ఈ పరిస్థితుల్లో ట్రాప్ అయిన షార్ట్ పొజిషన్లర్లు అప్రమత్తమై వెంటనే బయటపడ్డారు. ఇన్వెస్టర్లు కొత్త లాంగ్ పొజిషన్స్ తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. మధ్యంతర నివేదిక వల్ల గ్రూపు కంపెనీలపై తదుపరి విచారణల భయం తగ్గుతుంది. కాబట్టి షేర్ విలువ పెరగడానికి ఇది సహాయపడినట్లయింది అని HDFC సెక్యూరిటీస్ లిమిటెడ్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని అన్నారు.
వ్యాపార లావాదేవీల్లో ఎటువంటి దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆధారాలు లభించలేదని సుప్రీంకోర్టు ప్యానెల్ కు సెబీ తెలిపింది. అయితే ఇంకా విచారణ కొనసాగుతూనే ఉన్నట్లు వెల్లడించింది. ఏదైనా సెక్యూరిటీ చట్టాన్ని అదానీ కంపెనీలు ఉల్లంఘించాయా, అసాధారణ మార్కెట్ కార్యకలాపాలు జరిపాయా అన్న వివరాలను పరిశీలిస్తున్నట్లు చెప్పింది. అయితే విచారణ పూర్తి చేయడానికి న్యాయస్థానం ఇచ్చిన గడువు ఆగస్టు 14 వరకు ఉంది.


Click it and Unblock the Notifications