For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Hallmarking: బంగారం హాల్ మార్కింగ్ ప్రాముఖ్యత

|

సంప్రదాయంగా బంగారం అనేది భారతీయులకు ప్రసిద్ధ పెట్టుబడి ఎంపిక. ముఖ్యంగా ఆభరణాల రూపంలో ఇది ఒక మంచి పెట్టుబడిగా ఉంటూ వస్తోంది. ఇటీవలి కాలంలో ఆభరణాల రూపంలోనే కాకుండా ఇతర రూపాల్లోను ఇన్వెస్ట్ చేస్తున్నారు. బంగారం వివిధ యుటిలిటీస్‌ను కలిగి ఉంది. ప్రధానంగా నగలు, ఆభరణాలు చేయడానికి ఉపయోగిస్తారు. బంగారం పెట్టుబడి పోర్ట్‌పోలియో విషయానికి వస్తే గోల్డ్ ఈటీఎఫ్, సావరీన్ గోల్డ్ బాండ్, డిజిటల్ గోల్డ్ వంటివి ఉన్నాయి.

ఈ రకమైన బంగారం కేంద్ర బ్యాంకుల్లో బంగారు కడ్డీ లేదా బంగారు నాణం రూపంలో నిల్వ చేయబడుతుంది. కేంద్ర ప్రభుత్వం ఆభరణాల హాల్ మార్కింగ్ తప్పనిసరి నిర్ణయం తీసుకుంది. హాల్ మార్కింగ్ అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో హాల్ మార్కింగ్ అంటే ఏమిటి, పరిశ్రమకు ఎందుకు ముఖ్యం అనే అంశం చూద్దాం.

గోల్డ్ హాల్ మార్కింగ్ ఏమిటి?

గోల్డ్ హాల్ మార్కింగ్ ఏమిటి?

హాల్ మార్కింగ్ అనేది ఆభరణాలు/కళాఖండాలు లేదా బులియన్/నాణేలకు అక్యురేట్ డిటర్మినేషన్, అధికారిక గుర్తింపు. బంగారం సహజంగా లైట్ మెటల్. సులభంగా వంగుతుంది. ఈ బంగారం కఠినంగా మారడానికి ఇతర లోహాలను జోడిస్తారు. అయితే ఈ బంగారు ఆభరణంలో ఇతర మెటల్ అధికంగా జోడించడం లేదని అధికారికంగా గుర్తింపు ఇచ్చేదే హాల్ మార్కింగ్. 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్ల బంగారం ఉంటుంది. మరోవైపు ఆర్బీఐ ద్వారా సావరీన్ గోల్డ్ బాండ్స్ జారీ చేస్తారు. అధిక క్యారెట్ లేదా మెరుగైన స్వచ్ఛతకలిగిన బంగారం ఎక్కువ ధరను కలిగి ఉంటుంది.

బంగారంపై హాల్ మార్కింగ్ ఇది కేడీఎం జ్యువెల్లరీ కాదని హామీ ఇస్తుంది.

హాల్‌మార్క్ గుర్తులో మూడు అంశాలు ఉంటాయి. త్రిభుజాకారంలో ఉన్న BIS గుర్తు ఉందో లేదో చూసుకోవాలి. స్వచ్చతను సూచించే క్యారెటేజ్ చూసుకోవాలి. దీంతో అసెయింగ్ హాల్ మార్కింగ్ కేంద్రం గుర్తు ఉందా లేదా తెలుసుకోవాలి. BIS లైసెన్స్ చూపించాలని దుకాణదారుడిని అడగవచ్చు. BIS మార్గదర్శకాల ప్రకారం ఆభరణాల లైసెన్స్‌ను కొనుగోలుదారులకు చూపించాల్సి ఉంటుంది. అందులోని అడ్రస్‌లోనే షాప్ ఉందో లేదో చూసుకోవాలి.

బిల్లు తీసుకునేటప్పుడు హాల్ మార్కింగ్ ఛార్జీలను కూడా పేర్కొనమని అడగవచ్చు. హాల్‌మార్క్ చేసిన వస్తువుకు నగల దుకాణదారుడి నుండి ఏహెచ్‌సీలు రూ.35 వసూలు చేస్తాయి. మీరు సొంతంగా కూడా ఏహెచ్‌సీ వ‌ద్ద‌ ఆభరణాలను తనిఖీ చేయవచ్చు. BIS వెబ్‌సైట్‌లో ఏహెచ్‌సీల జాబితాను చూడవచ్చు. కొంత మొత్తం ఛార్జీలతో కస్టమర్లు తమ ఆభరణాల స్వచ్ఛతను తెలుసుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి.

గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బంగారం పెట్టుబడిగా ప్రసిద్ధి గాంచింది. దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ కోసం, ఆభరణంగా ఉపయోగించడం కోసం బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఎప్పుడైనా అత్యవసరంగా డబ్బులు అవసరమైతే బంగారాన్ని తాకట్టి పెట్టి రుణం కూడా తీసుకుంటారు.

రీసేల్ వ్యాల్యూ

రీసేల్ వ్యాల్యూ

బంగారం వ్యాల్యూ ఎప్పటికప్పుడు మారుతుంటుంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లోను బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎవరైనా ఇప్పుడు బంగారంపై ఇన్వెస్ట్ చేసి, కొన్నాళ్ల తర్వాత దానిని విక్రయించాలనుకుంటే అప్పటి పరిస్థితిని బట్టి మార్పు ఉంటుంది. అప్పటి మార్కెట్ రేటు ఆధారంగా బంగారం ధరను నిర్ణయిస్తారు. అయితే స్వచ్ఛమైన బంగారాన్ని గుర్తించడం ఎలా? అందుకే హాల్ మార్కింగ్ అవసరం. బంగారం నాణ్యతను బట్టి ధర మారుతుంది. దీనిని హాల్ మార్కింగ్ ద్వారా గుర్తించవచ్చు. అప్పుడు రీసేల్ వ్యాల్యూ దానిని బట్టి ఉంటుంది.

బంగారం ఎంత స్వచ్ఛమైనదో తెలియకుంటే కొనుగోలుదారులకు రిస్క్ అవుతుంది. కొనుగోలు సమయంలో తెలియకుంటే విక్రయించడం కూడా ఇబ్బందికరమే. బంగారం ప్యూరిటీ తెలియకుండా కొనుగోలు చేస్తే, అమ్మకందారు నకిలీ దానిని లేదా తక్కువ ప్యూరిటీ కలిగిన బంగారాన్ని విక్రయిస్తే, ఆ తర్వాత కొనుగోలుదారుకు ఇది సవాల్‌గా మారుతుంది. బంగారం ప్యూరిటీ తెలియకుంటే భారీ మొత్తంలో డబ్బును నష్టపోయే అవకాశాలు ఉంటాయి. బంగారం రీసేల్ వ్యాల్యూ కచ్చితంగా ఉండాలంటే హాల్ మార్కింగ్ సిస్టం బేస్‌మెంట్‌గా ఉంటుందని చెప్పవచ్చు.

బంగారంపై పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్ట్‌మెంట్ లేదా బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తుంటారు. మీ పోర్ట్‌పోలియోలో 15 శాతం నుండి 20 శాతం వరకు బంగారం ఉండాలని చెబుతారు. ఇలాంటిసమయంలో కొనుగోలుదారుకు నష్టం లేకుండా హాల్ మార్కింగ్ ఉపయోగపడుతుంది. అలాగే, బంగారం వర్తకులకు కూడా ఇది ప్రయోజనకరమే. ఎందుకంటే ఆ అమ్మకందారుపై కొనుగోలుదారులు విశ్వాసం చూపిస్తారు.

హాల్ మార్కింగ్

హాల్ మార్కింగ్

22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్ల బంగారు ఆభరణాలపై తప్పనిసరిగా హాల్ మార్క్ ఉండాలని కేంద్రం నిర్ణయించింది. హాల్ మార్క్ ఉంటే ఇటు కస్టమర్, అటు బంగారం వ్యాపారి ఇద్దరికీ ప్రయోజనం. BIS హాల్ మార్కింగ్ స్కీంలో ఆభరణాలకు రిజిస్ట్రేషన్ మంజూరు, అస్సైయింగ్ అండ్ హాల్ మార్కింగ్(A&H)కు గుర్తింపు ఉంటుంది. ఆభరణాల హాల్ మార్కింగ్ ప్రక్రియలో BIS-A&H సెంటర్‌లో నాణ్యతను తనిఖీ చేస్తారు. ఇక్కడ పరీక్షించిన అనంతరం A&H సెంటర్‌లో హాల్ మార్కింగ్ ముద్రను వేస్తారు. రిజిస్టర్డ్ జ్యువెల్లర్స్ హాల్ మార్కింగ్ కోసం BIS రికగ్నైజ్డ్ A&H సెంటర్‌కు ఆభరణాలను ఇస్తే, పరీక్ష అనంతరం హాల్ మార్కింగ్ వేస్తారు.

BIS జ్యువెల్లర్స్ రిజిస్ట్రేషన్‌ను సులభతరం చేసింది. ఈ పూర్తి ప్రక్రియ కూడా మ్యాన్యువల్‌గా కాకుండా ఆన్‌లైన్ ద్వారా ఉంటుంది. జ్యువెల్లర్స్ ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. సంబంధిత పత్రాలతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లించాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యాక దరఖాస్తుదారు BIS రిజిస్టర్డ్ జ్యువెలర్ అవుతారు. BIS రిజిస్ట్రేషన్ ఫీజు కూడా తక్కువగా నిర్ణయించారు. టర్నోవర్ రూ.5 కోట్ల కంటే తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ ఫీజు రూ.7500, రూ.5 కోట్ల నుండి 25 కోట్లు టర్నోవర్ అయితే రూ.15,000, రూ.25 కోట్లకు పైగా టర్నోవర్ ఉంటే రూ.40 వేలు చెల్లించాలి. టర్నోవర్ రూ.100 కోట్లు దాటితే రూ.80 వేలు చెల్లించాలి.

చర్చ ఎందుకు?

చర్చ ఎందుకు?

హాల్ మార్కింగ్‌ను ప్రవేశ పెట్టాలని 2000 సంవత్సరంలో BISను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే 2005లో సిల్వర్ స్కీం వచ్చింది. ఇప్పటి వరకు హాల్ మార్కింగ్ స్వచ్చంధం. ఇప్పుడు తప్పనిసరి చేసింది కేంద్రం. అయితే చిన్న దుకాణాలు, ఆభరణాల వ్యాపారులు, సంఘాలు మాత్రం హాల్ మార్కింగ్ తమకు ఇబ్బందికరమని చెబుతున్నాయి. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారులు విక్రయించే ఆభరణాలకు హాల్ మార్కింగ్ ఉండదు. అలాగే ఈ ప్రక్రియకు సమయం తీసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కరోనా సమయంలో ఆభరణాల విక్రయాలు లేకుండా పోయాయని, హాల్ మార్కింగ్ అంటే ఇప్పటికే ఉన్న ఆభరణాలు అమ్ముడుపోకపోవడం ఇబ్బందికరంగా మారుతుందని చెబుతున్నారు.

English summary

Gold Hallmarking: బంగారం హాల్ మార్కింగ్ ప్రాముఖ్యత | Gold Hallmarking In India And Its Importance

In the gold jewellery segment, there is one essential factor attached, which is hallmarking of gold.
Story first published: Friday, August 27, 2021, 14:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X