For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకుల ద్వారా అధిక రాబ‌డి పొంద‌గ‌లిగే సుర‌క్షిత‌మైన 8 మార్గాలు

సుక‌న్య స‌మృద్ధి స్కీమ్‌, సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ ఫండ్‌, పీపీఎఫ్ లాంటి ఎన్నో సామాజిక ప‌థ‌కాలు వివిధ వ‌ర్గాల‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దేశ‌వ్యాప్తంగా ఈ ప‌థ‌కాల‌ను ఒక‌ప్పుడు అన్ని పోస్టాఫీసులు అందించేవి.

By Staff
|

బ్యాంక్ డిపాజిట్ రేట్లు త‌గ్గుతున్నా... అధిక రాబ‌డికి 8 మార్గాలు

ఇంట్లో పొదుపు చేయ‌డ‌మ‌నేది ఏ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కైనా ఊత‌మిచ్చేదే అవుతుంది. ఇంట్లో చేసుకునే పొదుపు కాస్తా చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలుగా మారి మంచి రాబ‌డినిస్తున్నాయి. సుర‌క్షిత‌మైన వ‌డ్డీతో పాటు ఆక‌ర్ష‌ణీయ‌మైన పెట్టుబ‌డి అవ‌కాశాన్ని చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు అందిస్తున్నాయి. సుక‌న్య స‌మృద్ధి స్కీమ్‌, సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ ఫండ్‌, పీపీఎఫ్ లాంటి ఎన్నో సామాజిక ప‌థ‌కాలు వివిధ వ‌ర్గాల‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. దేశ‌వ్యాప్తంగా ఈ ప‌థ‌కాల‌ను ఒక‌ప్పుడు అన్ని పోస్టాఫీసులు అందించేవి. క్ర‌మేణా ప్ర‌భుత్వ రంగ బ్యాంకులకు ఆ త‌ర్వాత‌... మూడు ప్రైవేట్ రంగ బ్యాంకుల‌కు ఈ ప‌థ‌కాల ద్వారా డిపాజిట్ల‌ను స్వీక‌రించించేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తినిచ్చింది.

గ‌తేడాది వ‌ర‌కు కేవ‌లం ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌, కిసాన్ వికాస్ ప‌త్ర‌(కేవీపీ), సుక‌న్య స‌మృద్ధి ఖాతా, సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ అకౌంట్‌ల‌లో లావాదేవీలు చేసుకునేందుకు మాత్ర‌మే బ్యాంకుల‌కు అనుమ‌తినిచ్చారు.

ఇప్పుడు ప్ర‌భుత్వం బ్యాంకుల‌కు మ‌రిన్ని ప‌థ‌కాల ద్వారా డిపాజిట్ల‌ను స్వీక‌రించేలా అనుమ‌తుల‌ను ఇచ్చేసింది. ఇందులో భాగంగా నేష‌న‌ల్ సేవింగ్స్ స‌ర్టిఫికెట్ (ఎన్ఎస్‌సి), రికరింగ్ డిపాజిట్లు, మంత్లీ ఇన్‌క‌మ్ ప్లాన్‌లు ఉన్నాయి. ప్ర‌భుత్వం అన్ని ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌కు ఈ మేర‌కు అధీకృత్వం ఇచ్చింది. ప్రైవేట్ బ్యాంకుల్లోనూ టాప్ మూడు స్థానాల్లో ఉన్న ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకుల‌కు ఈ అవ‌కాశం ద‌క్కింది. దీంతో ఆయా బ్యాంకుల వినియోగ‌దారుల‌కు అనుకూలంగా మారింది.

ప్ర‌తి పెట్టుబ‌డి ప‌థ‌కానికి విభిన్న వ‌డ్డీ రేట్టు, వివిధ కాల‌వ్య‌వ‌ధులు ఉన్నాయి. ఒక్కొక్క‌రి ఆర్థిక ల‌క్ష్యానికి త‌గ్గ‌ట్టుగా ఎంపిక చేసుకోవ‌డం మేలు. బ్యాంకులు అందించే ఈ ప‌థ‌కాల ముఖ్య ఫీచ‌ర్ల‌ను తెలుసుకుందాం. ప్ర‌భుత్వం చిన్న మొత్తాల పొదుపు రేట్ల‌ను ప్ర‌తి మూడు నెల‌ల‌కోసారి మార్చే ప్ర‌క్రియ‌కు ఏప్రిల్ 2016 నుంచి శ్రీ‌కారం చుట్టిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం 2018 జ‌న‌వ‌రి 1 నుంచి మార్చి 31 దాకా కొత్త వ‌డ్డీ రేట్లు వ‌ర్తించ‌నున్నాయి.
ఈ విధంగా అధిక వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తూ సుర‌క్షితంగా ఉండే చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల గురించి ఇక్క‌డ తెలుసుకుందాం.

1.) 7.6 శాతం ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌(పీపీఎఫ్‌)

1.) 7.6 శాతం ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌(పీపీఎఫ్‌)

*అత్యుత్త‌మ రిటైర్‌మెంట్ ప‌థ‌కం ఇది. దీర్ఘ‌కాలానికీ మంచి పెట్టుబ‌డి మార్గం.

* పీపీఎఫ్ వార్షిక వ‌డ్డీ రేటు 7.6శాతం నిర్ణ‌య‌మైంది. కాల‌వ్య‌వ‌ధి 15ఏళ్లు.

* ఏడాదికి క‌నీసం రూ.500 డిపాజిట్ చేయాలి. గ‌రిష్టంగా రూ.1.5లక్ష‌ల డిపాజిట్‌కు అనుమ‌తి.

* పిల్ల‌ల చ‌దువుల‌కు లేదా వారి పెళ్లిళ్ల‌కు లేదా సొంత ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి కోసం ఈ ప‌థ‌కం ఉత్త‌మ‌మైన‌ది. రాబ‌డిపై ప‌న్ను ఉండ‌దు. పైగా సెక్ష‌న్ 80సీ కింద రూ.1.5ల‌క్ష‌ల దాకా పెట్టుబ‌డుల‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

* ఎవ‌రైనా త‌మ పేరు మీద‌, త‌మ భాగ‌స్వామి పేరు మీద చెరొక రూ.1.5ల‌క్ష‌ల చొప్పున మొత్తం రూ.3ల‌క్ష‌లు ఏడాదికి జ‌మ‌చేస్తూ 15ఏళ్ల పాటు చేస్తే పెట్టుబ‌డి మొత్తం రూ.45ల‌క్ష‌లు అవుతుంది. వ‌డ్డీతో క‌లిపి అప్ప‌టికి రూ.90ల‌క్ష‌లు చేతికొచ్చే అవ‌కాశ‌ముంది.

2.) కిసాన్ వికాస్ ప‌త్ర‌(కేవీపీ)

2.) కిసాన్ వికాస్ ప‌త్ర‌(కేవీపీ)

* కిసాన్ వికాస్ ప‌త్ర 7.3శాతం వ‌డ్డీని అందిస్తుంది.

* 11 నెల‌ల మెచ్యూరిటీ తీరుతుంది.

* సుమారు 120 నెల‌ల్లో పెట్టుబ‌డి రెండింత‌ల‌వుతుంది.

* క‌నీసం రూ.1000 పెట్టొచ్చు, గ‌రిష్టంగా ఎంతైనా పెట్టుబ‌డి చేయొచ్చు.

* దుర‌దృష్ట‌వ‌శాత్తు సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నాలు దీనికి వ‌ర్తించ‌వు.

3.) సుక‌న్య స‌మృద్ధి ఖాతా

3.) సుక‌న్య స‌మృద్ధి ఖాతా

* ఇది కేవ‌లం ఆడ‌పిల్ల‌ల సంక్షేమం కోసం ఉద్దేశించింది.

* ఏటా 8.1శాతం వ‌డ్డీ అందించ‌నుంది.

* మెచ్యూరిటీ సొమ్ము పూర్తి ప‌న్ను మిన‌హాయింపున‌కు అర్హ‌త సాధిస్తుంది.

* క‌నీసం రూ.1000 మొద‌లుకొని రూ.1.5ల‌క్ష‌ల దాకా పెట్టుబ‌డి పెట్టొచ్చు.

* దీని కాల‌వ్య‌వ‌ధి 21ఏళ్లు. ఐతే ఆలోపు కావాలంటే కొన్ని ష‌ర‌తుల‌కు లోబ‌డి సొమ్మును విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

* ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఇందులో క‌నీసం 8 శాతం వ‌డ్డీ వ‌స్తుంది.

4.) సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్‌

4.) సీనియ‌ర్ సిటిజ‌న్ సేవింగ్స్ స్కీమ్‌

* ఈ ప‌థ‌కం సీనియ‌ర్ సిటిజ‌న్స్‌కు అద్భుతంగా ఉంటుంది.

* వార్షికంగా 8.3శాతం వ‌డ్డీ లెక్కించినా... చెల్లించేది మాత్రం మూడు నెల‌ల‌కోసారి.

* కాల‌వ్య‌వ‌ధి 5ఏళ్లు.

* క‌నీసం రూ.1000డిపాజిట్ చేయ‌వ‌చ్చు. గ‌రిష్టంగా రూ.1.5ల‌క్ష‌ల దాకా అనుమ‌తిస్తారు.

5.) 7.4శాతం కాల‌ప‌రిమితి డిపాజిట్లు(టైమ్ డిపాజిట్ స్కీమ్‌)

5.) 7.4శాతం కాల‌ప‌రిమితి డిపాజిట్లు(టైమ్ డిపాజిట్ స్కీమ్‌)

* ఇది సాధార‌ణ ఫిక్స్‌డ్ డిపాజిట్ ప‌థ‌కం లాంటిది.

* పెట్టుబ‌డి కాల‌వ్య‌వ‌ధుల్లో 1, 2, 3 మ‌రియు 5 ఏళ్ల‌లో అనుకూల‌మైన‌దాన్ని ఎంచుకోవ‌చ్చు.

* వ‌డ్డీ రేట్లు జ‌న‌వ‌రి-మార్చి 2018 త్రైమాసికానికి 6.6-7.4శాతంగా నిర్ణ‌యించారు.

* వ‌డ్డీ లెక్కింపు 3 నెల‌ల‌కోసారి, ఐతే చెల్లింపులు మాత్రం ఏడాదికోసారే.

* క‌నీసం రూ.200 పెట్టుబ‌డి చెయ్యాలి. గ‌రిష్ట పెట్టుబ‌డికి ప‌రిమితి లేదు.

6.) నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం(మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్‌)

6.) నెల‌వారీ ఆదాయ ప‌థ‌కం(మంత్లీ ఇన్‌క‌మ్ స్కీమ్‌)

* ఈ ప‌థ‌కం రిటైర్‌మెంట్ అయిన‌వారికి బాగా అనుకూలం. ఎందుకంటే వ‌డ్డీని ప్ర‌తి నెలా చెల్లిస్తారు.

* ఏడాదికి 7.5శాతంగా వ‌డ్డీ నిర్ణ‌యించారు.

* క‌నీసం రూ.1,500 పెట్టుబ‌డి పెట్టొచ్చు. గ‌రిష్టంగా రూ.4.5ల‌క్ష‌ల దాకా పెట్టుబ‌డి చేయోచ్చు. ఉమ్మ‌డి ఖాతా అయితే రూ.9ల‌క్ష‌ల దాకా అనుమ‌తిస్తారు.

* వాడుకుంటే ఇది రెగ్యుల‌ర్ ఇన్‌క‌మ్‌ ఇచ్చే ప‌థ‌కంలా మారుతుంది. ముఖ్యంగా సీనియ‌ర్ సిటిజ‌న్స్ కు బాగా ప‌నికొస్తుంది.

7) రిక‌రింగ్ డిపాజిట్లు

7) రిక‌రింగ్ డిపాజిట్లు

* ఇది సాధార‌ణ బ్యాంకు ఆర్‌డీ లాంటిది.

* క‌నీస కాల‌వ్య‌వ‌ధి 5ఏళ్లు. నెల నెలా క‌నీస డిపాజిట్‌ను 10వ తేదీలోపు చేయాల్సి ఉంటుంది. గ‌రిష్ట పెట్టుబ‌డికి ప‌రిమితి లేదు.

* ప్ర‌స్తుత వ‌డ్డీ రేటు 6.9శాతంగా నిర్ణ‌యించారు. 3 నెల‌ల‌కోసారి మార్చుతార‌న్న సంగ‌తి తెలిసిందే.

* 5ఏళ్ల పాటు నెల‌కు రూ.1000 డిపాజిట్ చేస్తే రూ.71,818 జ‌మ అవుతుంది.

* దీన్ని కావాల‌నుకుంటే మ‌రో 5ఏళ్ల పాటు.. సంవ‌త్స‌రం చొప్పున‌ పొడిగించుకోవ‌చ్చు.

* ఇందులో కాస్త అటు ఇటుగా 6.9% వ‌ర‌కూ వ‌డ్డీ వ‌స్తుంది.

8.) జాతీయ పొదుపు ప‌త్రాలు

8.) జాతీయ పొదుపు ప‌త్రాలు

* వార్షిక వ‌డ్డీ రేటు 7.6శాతం.

* క‌నీసం రూ.100 డిపాజిట్ చేయాలి. గ‌రిష్ట ప‌రిమితి లేదు.

* త‌క్కువ రిస్క్ తీసుకోవాలి అనుకునేవారికి ఇది అనుకూలం. అలాగే ప‌న్ను ఆదా చేసుకోవాల‌నుకునేవారికి ఇది స‌రైన ఎంపిక‌. ఈ రెండు వ‌ద్ద‌నుకుంటే అధిక రాబ‌డినిచ్చే ప‌థ‌కాల‌ను ఎంచుకోవ‌చ్చు.

English summary

బ్యాంకుల ద్వారా అధిక రాబ‌డి పొంద‌గ‌లిగే సుర‌క్షిత‌మైన 8 మార్గాలు | 8 High Return Small Saving Schemes Offered by Banks now

Every investment scheme bears different rates of interest and maturity time to offer different financial goals of the investors. The following are the main features of the schemes offered by the banks now. It is to be noted that the Government has declared that the interest on small saving schemes will be revised on quarterly basis since April 1, 2016. The interest rates indicated here are for Oct-2017 to Dec-2017
Story first published: Wednesday, January 3, 2018, 10:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X