ఏప్రిల్ 1,2017 నుంచి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం 0.1% మేర తగ్గించింది. గతంలో ఏడాదికి ఒకసారి సవరించే వడ్డీ రేట్లను క్రితం సంవత్సరం నుంచి త్రైమాసికానికి ఒకసారి మార
ఏప్రిల్ 1,2017 నుంచి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం 0.1% మేర తగ్గించింది. గతంలో ఏడాదికి ఒకసారి సవరించే వడ్డీ రేట్లను క్రితం సంవత్సరం నుంచి త్రైమాసికానికి ఒకసారి మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రేట్లు ఈ కింది విధంగా ఉన్నాయి.

8 నుంచి 7.9 శాతానికి
ప్రజల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందిన దీర్ఘకాల పొదుపు పథకం పీపీఎఫ్, 5 ఏళ్ల జాతీయ పొదుపు పత్రం వడ్డీ రేట్లను ప్రస్తుతం ఉన్న 8 శాతం నుంచి 7.9 శాతానికి తగ్గించారు. దీంతో పీపీఎఫ్ వడ్డీ రేట్లు గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత కనిష్టానికి వెళ్లాయి.

సుకన్య సమృద్ది ఖాతా
బాలికల కోసం ఉద్దేశించిన సుకన్య సమృద్ది పథకం ఇప్పటికే అమ్మాయుల తల్లిదండ్రులను పెద్దగా ఆకర్షించలేదు. ప్రస్తుతం దీని వార్షిక వడ్డీ రేటు 8.5% ఉండగా ఇకపై 8.4 శాతానికి తగ్గించారు.

మిగిలిన పథకాల వడ్డీ రేట్లు
కిసాన్ వికాస్ పత్ర వడ్డీ రేట్లు 7.6 శాతానికి తగ్గించారు. గతంలో ఈ వడ్డీ రేటు 7.7% ఉండేది. 5 సంవత్సరాల సీనియర్ సిటిజన్ పొదుపు పథకం వడ్డీ రేటు 7.9 శాతానికి తగ్గించారు. మామూలుగా పొదుపు ఖాతాలో నిల్వ ఉంచే డబ్బుపై వడ్డీరేటును 4 శాతం వద్దే యథాతథంగా ఉంచారు.

టర్మ్ డిపాజిట్ల రేట్లు
1 నుంచి 5 సంవత్సరాల కాలవ్యవధి కలిగిన టర్మ్ డిపాజిట్ వడ్డీ రేట్లను 6.9 - 7.7 శాతం మధ్యకు తగ్గించారు. టర్మ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను మూడు నెలలకొకసారి చెల్లిస్తారు. ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటు 7.2 శాతానికి తగ్గింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications