For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాల‌కు ఆధార్ త‌ప్ప‌నిస‌రి

పెట్టుబ‌డిదారులు పోస్టాఫీసు సంక్షేమ ప‌థ‌కాల్లో సొమ్ము జ‌మ చేస్తున్న‌ పీపీఎఫ్‌, జాతీయ పొదుపు ప‌త్రాలు(ఎన్ఎస్‌సీ), కిసాన్ వికాస్ ప‌త్ర వంటి వాటికి ఆధార్ అనుసంధానాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్ర ప్ర‌భుత

|

వ‌రుస‌గా వివిధ ప‌థ‌కాల‌కు, మీ ద‌గ్గ‌ర ఉన్న రుజువుల‌కు ఆధార్ లంకె పెడుతున్న కేంద్రం తాజాగా మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. పెట్టుబ‌డిదారులు పోస్టాఫీసు సంక్షేమ ప‌థ‌కాల్లో సొమ్ము జ‌మ చేస్తున్న‌ పీపీఎఫ్‌, జాతీయ పొదుపు ప‌త్రాలు(ఎన్ఎస్‌సీ), కిసాన్ వికాస్ ప‌త్ర వంటి వాటికి ఆధార్ అనుసంధానాన్ని త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం వెలువ‌రించింది. ఇదివ‌ర‌కే డిపాజిట్లు చేసి ఉన్న వారికి ఆధార్ అనుసంధానానికి డిసెంబ‌రు 31,2017 వ‌ర‌కూ గ‌డువు ఇచ్చింది. దీనికి సంబంధించి మ‌రిన్ని విష‌యాల‌ను తెలుసుకుందాం.

పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాలు

ఆర్థిక శాఖ గెజిట్ నోటిఫికేష‌న్లు
ఆర్థిక శాఖ ఆధార్ త‌ప్ప‌నిసరికి సంబంధించి నాలుగు ప్ర‌త్యేక గెజిట్ నోటిఫికేష‌న్ల‌ను విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాల‌కు ఆధార్ త‌ప్ప‌నిస‌రి. దీంతో ఇప్ప‌టి నుంచి పీపీఎఫ్‌, ఎన్ఎస్‌సీ, కిసాన్ వికాస్ ప‌త్ర మొద‌లైన ఖాతాలు నిర్వ‌హించే వారు ఆధార్ నంబ‌రును త‌ప్ప‌క ఇవ్వాల్సిందే. ఒక‌వేళ ఆయా ఖాతాలు తెరిచే వారి ద‌గ్గ‌ర ఇదివ‌ర‌కూ ఆధార్ నంబ‌రు లేక‌పోతే క‌నీసం ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ నంబ‌రయినా ఇవ్వాల్సి ఉంటుంద‌ని నోటిఫికేష‌న్ తెలిపింది.

పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాలు

పోస్టాఫీసు కార్యాల‌యంలో
ఇదివ‌ర‌కే డిపాజిట్ ఖాతాలు క‌లిగిన వారు పోస్టాఫీసు పొదుపు ఖాతా లేదా డిపాజిట్ క‌లిగిన బ్రాంచి కార్యాల‌యాల్లో డిసెంబ‌రు 31 లోగా ఆధార్ నంబ‌రును స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. కేంద్ర ప్ర‌భుత్వం ఒక‌టి మీద ఒక‌టి కొత్త నిబంధ‌న‌ల‌తో చాలా వాటికి ఆధార్ అనుసంధానించే దిశగా ముందుకు సాగుతోంది. బ్యాంకు డిపాజిట్లు, మొబైల్ సిమ్ కార్డుల‌కు, ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాల‌కు ఆధార్ త‌ప్ప‌నిసరి చేసిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు
కేంద్రం తెల్ల రేష‌న్ కార్డు దారుల‌కు, దారిద్ర్య రేఖ‌కు దిగువన ఉన్న‌వారికి అందిస్తున్న ప్ర‌యోజ‌నాలు ప‌క్క దారి ప‌ట్ట‌కుండా న‌గ‌దు బ‌దిలీ తీసుకొచ్చింది. ఇంకా ప్ర‌త్య‌క్ష న‌గ‌దు బ‌దిలీ ద్వారా అక్ర‌మాల‌ను, అన‌ధికార ల‌బ్దిదారుల‌ను ఏరివేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. అందుకే ఆయా సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్దిదారుల‌ను డిసెంబ‌రు 31 లోగా త‌మ ఆధార్ సంఖ్య‌ల‌ను ప్ర‌భుత్వానికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు.

దీనిపై మీ ఆస‌క్తిక‌ర కామెంట్‌ను రాయండి

English summary

పోస్టాఫీసు పొదుపు ప‌థ‌కాల‌కు ఆధార్ త‌ప్ప‌నిస‌రి | Govt made aadhaar mandatory for post office saving schemes

The 12-digit unique identification number Aadhaar has now been made mandatory for all post office deposits, PPF, the National Savings Certificate (NSC) scheme and Kisan Vikas Patra (KVP).
Story first published: Friday, October 6, 2017, 17:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X