For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్లు త‌గ్గింపు

చిన్న పెట్టుబ‌డిదారుల ఆశ‌ల‌ను నిరాశ‌ప‌రిచే నిర్ణ‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంది. ఇప్ప‌టికే త‌క్కువ‌గా ఉన్న చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్ల‌ను మ‌ళ్లీ త‌గ్గించింది. జులై 1 నుంచి వ‌ర్తించే

|

చిన్న పెట్టుబ‌డిదారుల ఆశ‌ల‌ను నిరాశ‌ప‌రిచే నిర్ణ‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకుంది. ఇప్ప‌టికే త‌క్కువ‌గా ఉన్న చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్ల‌ను మ‌ళ్లీ త‌గ్గించింది. జులై 1 నుంచి వ‌ర్తించే విధంగా చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల‌పై వ‌డ్డీ రేట్లు 10 బేసిస్ పాయింట్ల మేర త‌గ్గాయి. శుక్ర‌వారం ఆర్థిక శాఖ ప్ర‌క‌ట‌న మేర‌కు రెండో త్రైమాసికానికి(జులై 1- సెప్టెంబ‌రు 30) వ‌డ్డీ రేట్ల‌ను 0.10 శాతం మేర త‌గ్గించింది. మార్చిన వ‌డ్డీ రేట్లు ఇలా ఉన్నాయి.

చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు

పీపీఎఫ్‌
పీపీఎఫ్‌ అంటే ప్ర‌జా భ‌విష్య నిధి(ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్). పీపీఎఫ్‌ వ‌డ్డీ రేటును ఇంత‌కు ముందున్న 7.9% నుంచి 7.8%కి త‌గ్గించారు. 2015-16 వ‌ర‌కూ పీపీఎఫ్‌కు 8.7 శాతం వ‌ర‌కూ వ‌డ్డీ వ‌చ్చేది. ఏప్రిల్ 2016 నుంచి త్రైమాసికానికి ఒక‌సారి ఈ వ‌డ్డీ రేట్ల‌ను మారుస్తున్నారు.

చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు

సుక‌న్య సమృద్ది
ఆడ‌పిల్ల‌ల పేరిట త‌ల్లిదండ్రులు పొదుపు చేసేందుకు ఉద్దేశించిన ప‌థ‌కం సుక‌న్య స‌మృద్ది యోజ‌న‌. సుక‌న్య స‌మృద్ది యోజ‌న‌, ఐదేళ్ల సీనియ‌ర్ సిటిజ‌న్ పొదుపు ప‌థ‌కం సంబంధించిన వ‌డ్డీ రేట్ల‌ను 8.4% నుంచి 8.3%కి త‌గ్గించారు.

చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాలు

కిసాన్ వికాస్ ప‌త్ర‌
కిసాన్ వికాస గతేడాది ఉన్న 110,111 నెల‌ల మెచ్యూరిటీ నుంచి మారుతూ వ‌స్తున్న‌ది. ఇప్ప‌టి వ‌డ్డీ మార్పు రేట్ల‌తో కిసాన్ వికాస్ ప‌త్రం గ‌తంలో 113 నెల‌ల్లో మెచ్యూరిటీ అవుతుండ‌గా ఇప్పుడు 115 నెల‌ల‌కు పెరిగింది. కిసాన్ వికాస్ ప‌త్ర వ‌డ్డీ రేటును 7.5%గా నిర్ణ‌యించ‌డంతో ఈ విధంగా జ‌రిగింది. సాధార‌ణ పొదుపు ప‌థ‌కం కింద ఉండే వ‌డ్డీ రేటును 4 శాతం వ‌ద్దే ఉంచారు.

Read more about: small saving schemes savings
English summary

చిన్న మొత్తాల పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్లు త‌గ్గింపు | government slashes interest rates on small saving schemes

In a big blow for small investors, the Finance Ministry has further slashed the interest rates on small saving schemes such as the Public Provident Fund (PPF) and the Kisan Vikas Patra (KVP) by another 10 basis points.The new rates, notified by the Ministry on Friday, will be effective for the second quarter of the fiscal between July 1 and September 30.
Story first published: Friday, June 30, 2017, 15:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X