కేంద్ర ప్రభుత్వం 2023-24 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాల వడ్డీ రేటును ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన (SSY) వడ్డీ రేటును 7.60 శాతం నుంచి 8 శాతానికి పెంచింది.
అయితే, ఈ SSY వడ్డీ రేటు త్రైమాసిక ప్రాతిపదికన మారవచ్చు కానీ ఎవరైనా తన ఆడపిల్ల పుట్టిన తర్వాత సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే దాదాపు 7.60 నుంచి 8 శాతం రాబడిని పొందే అవకాశం ఉంది. ఒక పెట్టుబడిదారుడు తన ఆడబిడ్డ పుట్టిన వెంటనే SSY ఖాతాలో పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే, 15 సంవత్సరాల పాటు పొదుపు చేయాల్సి ఉంటుంది.

అమ్మాయికి 18 ఏళ్లు వచ్చినప్పుడు మెచ్యూరిటీ మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన మెచ్యూరిటీ మొత్తాన్ని ఆడపిల్లకి 21 ఏళ్లు వచ్చినప్పుడు విత్‌డ్రా చేసుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో దాదాపు 7.6 శాతం రాబడిని ఉంటే, ఒక వ్యక్తి నెలకు రూ.12,500ని ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి రూ.1.5 లక్షలు అవుతుంది. ఈ మొత్తానికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.అమ్మాయికి 21 ఏళ్లు వచ్చినప్పుడు పెట్టుబడిదారు ఉపసంహరణ చేసుకుంటే రూ.63,79,634 వస్తుంది.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద ఒకే ఆర్థిక సంవత్సరంలో SSY ఖాతాలో పెట్టుబడి పెట్టిన రూ.1.50 లక్షల వరకు ఆదాయపు పన్ను ప్రయోజనాన్ని పొందవచ్చు. SSY మెచ్యూరిటీ మొత్తానికి 100 శాతం పన్ను మినహాయింపు ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజనలో సంవత్సరానికి కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు.


Click it and Unblock the Notifications