చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు యథాతథం
ఒక పక్క అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపైన వడ్డీ రేట్లను తగ్గిస్తున్న క్రమంలో సామాన్య మదుపరికి కాస్త స్వాంతన చేకూర్చే వార్త ఇది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రస్తుత వడ్డీ రేట్లనే కొనసా
ఒక పక్క అన్ని బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపైన వడ్డీ రేట్లను తగ్గిస్తున్న క్రమంలో సామాన్య మదుపరికి కాస్త స్వాంతన చేకూర్చే వార్త ఇది. చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రస్తుత వడ్డీ రేట్లనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి - మార్చి త్రైమాసికానికి అంతకుముందు అమల్లో ఉన్న వడ్డీ రేట్లే కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. పీపీఎఫ్, ఐదేళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 8 శాతం వడ్డీ రేటు అమలవుతుంది. కిసాన్ వికాస పత్రపై రాబడులు 7.7 శాతంగా ఉంటాయని, 112 నెలలకు గడువు తీరతాయని ఆర్థిక శాఖ వెల్లడించింది.
సుకన్య సమృద్ధి యోజన, ఐదేళ్ల సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌పైనా అదే రేటును వర్తింపజేస్తారు. సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై 4 శాతం, 1-5 ఏళ్ల వరకు కాల వ్యవధి గల టర్మ్ డిపాజిట్లపై 7 నుంచి 7.8 శాతం, రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీ రేటు 7.3 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయం మేరకు... ప్రతీ త్రైమాసిక కాలానికి చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను ప్రకటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ బాండ్లపై రాబడులు తగ్గుతున్న క్రమంలో ఇంతకుముందు ఏడాదికొకసారి నిర్ణయించే వడ్డీ రేట్లను గతేడాది నుంచి త్రైమాసికానికి ఒకసారి నిర్ణయిస్తూ ఉన్నారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications
